Gallery

Home News Walking: ఆరోగ్యానికి 'వాకింగ్'..! ఎంతసేపు, ఎంత దూరం, ఎలా నడవాలి..? సూచనలివే..

Walking: ఆరోగ్యానికి ‘వాకింగ్’..! ఎంతసేపు, ఎంత దూరం, ఎలా నడవాలి..? సూచనలివే..

Walking: వాకింగ్ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని గతంలోనూ డాక్టర్లు చెప్పిన విషయమే. కాకపోతే.. ప్రస్తుత కరోనా సమయంలో వాకింగ్ ప్రయోజనాలు బాగా తెలిసొచ్చాయి. వ్యాధినిరోధక శక్తిని పెంచుకుంటే కరోనా ఒక్కటే కాదు.. ఇతర వ్యాధుల నుంచి కూడా దూరం కావొచ్చని తెలుసుకున్నారు. దీంతో ఆరోగ్యంపై అవగాహన, బాడీ ఫిట్ నెస్ పై దృష్టి పెట్టడం జరుగుతోంది. దీంతో రోజూ వాకింగ్, వ్యాయామం చేసేవారు పెరిగారు., వ్యాయామ పరికరాలు, బరువులు ఎత్తాల్సిన అవసరం లేదు. అలా వాహ్యాళికి వెళ్లినట్టు వెళ్లినా వాకింగ్ పై దృష్టి పెరిగి నిరంతర వ్యాయామంగా మారుతుంది. ఆరోగ్యం దరి చేరుతుంది.

Adobestock 292545314 | Telugu Rajyam

ఈక్రమంలో వాకింగ్, పరుగు వల్ల ప్రయోజనాలేంటి? రోజుకు ఎంత దూరం నడవాలి? ఎంత వేగంతో నడవాలి? ఆ సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?.. అంటూ ఆరోగ్య సంరక్షణపై దృష్టి సారించి నడక ప్రాధాన్యాన్ని గుర్తిస్తున్నారు. నడక అనేది ఒక సులువైన వ్యాయామం. నడకతో శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోవచ్చు. అధిక బరువు, గుండె వ్యాధులు, డయాబెటిస్, బ్లడ్ ప్రెషర్, డిప్రెషన్.. వంటి అనారోగ్యాలను నడక దూరం చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. గుండె సంబంధ వ్యాధుల ప్రమాదం 31 శాతం మేర తగ్గుతుందని.. సీవీడీ సమస్యలతో మరణాల ప్రమాదం 32 శాతం తగ్గుతుందని పరిశోధకులు అంటున్నారు.

నడక.. మరీ ఎక్కవ కాకుండా.. తక్కువ కాకుండా మధ్యస్తంగా  ఉండే ఒక వ్యాయామం. వారానికి 150 నిమిషాల మంచి నడకతో ఉత్తమ ఫలితాలు ఉంటాయంటున్నారు నిపుణులు. సాధారణ వేగంతో నడకను ప్రారంభించి.. క్రమంగా సమయాన్ని.. వేగాన్ని పెంచుకోవచ్చు. ఒక వ్యక్తి వారానికి ఐదు రోజులపాటు ప్రతిరోజు 30 లేదా ఖాళీ సమయాల్లో 10 నిమిషాల చొప్పున ఇలా నడవాలని నిపుణులు సూచిస్తున్నారు. సాధారణ వ్యక్తులు ప్రతిరోజు 30-45 నిమిషాల నడక ద్వారా మంచి వ్యాయామ ఫలితాలను పొందవచ్చని కూడా నిపుణులు చెప్తున్నారు.

ఆరోగ్యకరమైన వ్యక్తులు గంటకు 3-4 మైళ్ల వేగంతో రోజుకు 2-4 మైళ్ల దూరం నడకను లక్ష్యంగా పెట్టుకోవచ్చు. సగటున నడకతో 2,000 అడుగులను వేయొచ్చు. పెడోమీటర్‌, స్మార్ట్ వాచ్ వంటి డివైజ్ లను ఉపయోగించి నడిచి దూరం తెలుసుకోవచ్చు. గంటకు రెండు మైళ్ల వేగంతో.. వారానికి ఐదున్నర మైళ్ల దూరం నడిచేవారు కూడా ఆరోగ్యంగా ఉండొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. నిమిషానికి 80 అడుగుల నడకను సాధారణ వేగంగా.. 100 అడుగులను మధ్యస్థం నుంచి చురుకైన వేగంగా.. 120 అడుగులతో నడిస్తే ఎక్కువ వేగంగా పరిగణించొచ్చు. మ్యూజిక్ వింటూ, పెట్ డాగ్స్ తో, ఫ్రెండ్స్ తో చిట్ చాట్ చేస్తూ కూడా వాకింగ్ చేయడం ఆరోగ్యంతోపాటు మానసికోల్లాసాన్ని కూడా ఇస్తుంది.

 

గమనిక: ఈ వివరాలు మీ అవగాహన కోసం మాత్రమే. పలు సందర్భాల్లో నిపుణులు, వైద్యులు అందించిన వివరాలనే ఇక్కడ ఇచ్చాం. మీ ఆరోగ్యం విషయంలో ఎటువంటి సమస్య ఉన్నా, సలహాలకైనా వైద్యులను, నిపుణులను సంప్రదించడమే ఉత్తమం. మీ ఆరోగ్యానికి సంబంధించి ‘తెలుగు రాజ్యం’ ఎటువంటి బాధ్యత వహించదు. గమనించగలరు.

- Advertisement -

Related Posts

పవన్ గురించి రానా ఆసక్తికర కామెంట్స్

ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న 'అయ్యప్పనుమ్ కోషియుమ్' తెలుగు రీమేక్ మీద భారీ క్రేజ్ నెలకొని ఉంది. ఈ మూవీ రెండు పాత్రల మధ్య హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలతో నిండి ఉంటుంది. మరి...

కరోనా మూడో వేవ్: కేరళకు ఏమయ్యింది.?

దేశంలోకి మొదట కరోనా వైరస్ ప్రవేశించిందే కేరళ రాష్ట్రం ద్వారానే. చైనా నుంచి వచ్చిన ఓ కేరళ వ్యక్తి కరోనా వైరస్‌ని దేశంలోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత దేశంలో కరోనా వైరస్ విస్తరించడానికి...

కేంద్రం కాఠిన్యం: విశాఖ ఉక్కు పరిశ్రమపై వారికి హక్కు లేదా.?

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయమై కేంద్రం రాష్ట్ర హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో కేంద్రం పేర్కొన్న అంశాలతో విశాఖ ఉక్కు పరిశ్రమ ఉద్యోగులు, కార్మికులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు.....

Latest News