తెలంగాణ రాష్ట్రంలో కకేసీఆర్ ను ఎదిరించి, నిలబడి, ప్రజల మద్దతు కూడగట్టుకున్న ప్రతిపక్ష నాయకుడు ఒక్కడు కూడా లేడు. ప్రజల దృష్టిలో కేసీఆర్ ప్రతిపక్ష నాయకులకు అందనంత ఎత్తున ఉన్నారు. ఆయన తీసుకునే ప్రతి నిర్ణయానికి తెలంగాణ ప్రజలు దాసోహం అవుతున్నారు. ప్రజలు ఆయనకు ఎంత మద్దతు ఇస్తున్నారంటే ఆయన తప్పులను కూడా క్షేమించేంతగా ఆయన పక్షాన నిలబడుతున్నారు.
తనకు ఎదురు ఎవ్వరులేరని కేసీఆర్ అనుకుంటున్న నేపథ్యంలో కరోనా విషయంలో గవర్నర్ తమిళ సై చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్నాయి. కరోనాను కట్టడి చేయడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని, ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుందని గవర్నర్ పేర్కొన్నారు. కరోనా నియంత్రణకు పెద్ద సంఖ్యలో టెస్టులు చేయటమే పరిష్కారమని, మొబైల్ టెస్టింగులు చేయాలని ప్రభుత్వాన్ని కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆమె పేర్కొన్నారు. కరోనా తీవ్రత వ్యాప్తిపై ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ.. సూచనలు చేస్తూ తాను ఐదారు లేఖలు రాసినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేనట్లుగా గవర్నర్ పేర్కొన్నట్లుగా జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
ప్రభుత్వ హాస్పిటల్స్ లలో అన్ని వసతులు కల్పిస్తున్నామని ప్రభుత్వం చెప్తుందని, కానీ అక్కడ సరైన వసతులు లేవని గవర్నర్ పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతులు లేకపోవడం వల్ల ప్రజలు ప్రైవేట్ హాస్పిటల్స్ కు వెళ్తున్నారని, అక్కడ వేసే అధిక ఫీజులు కట్టలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆమె వెల్లడించారు. తనకు రాష్ట్రంలో ఎదురులేదని కేసీఆర్ అనుకుంటున్న నేపథ్యంలో తమిళ సై కేసీఆర్ కు చుక్కలు చూపిస్తున్నారు. గవర్నర్ వ్యాఖ్యల్లో నిజం ఉందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ప్రతిపక్షాల నుండి కాకుండా ఇలా గవర్నర్ నుండి విమర్శలు రావడం కేసీఆర్ కు పెద్ద దెబ్బేనని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.