ఆ గోల్డెన్ ఛాన్స్ కూడ తమన్ కొట్టేశాడట !

తెలుగులో ఒకప్పుడు ట్రెండీ మ్యూజిక్ డైరెక్టర్ అంటే దేవిశ్రీప్రసాద్ పేరే వినబడేది. కానీ ఇప్పుడు ఆ స్థానాన్ని తమన్ దక్కించుకున్నాడు. వరుసపెట్టి సినిమాలు చేస్తూ చేసిన ప్రతి సినిమాను హిట్ ఆల్బమ్ గా మలుస్తుండటంతో తమన్ అందరికీ హాట్ ఫెవరేట్ అయ్యాడు. ఈమధ్య కాలంలో తెలుగులో బాగా హిట్ అయిన పాటలు చాలా వరకు తమన్ కంపోజ్ చేసినవే. ఒకప్పుడు కాపీ కొడతాడు అనే కామెంట్ ఉన్నా ఇప్పుడు దాన్ని అధిగమించాడు తమన్. దర్శకులకు ఎలాంటి సంగీతం కావాలో అలాంటిది తక్కువ సమయంలోనే ఇవ్వగలగడం తమన్ స్పెషాలిటీ. తమ నేపథ్య సంగీతంతో సినిమా స్థాయిని పెంచగలడు. అందుకే స్టార్ డైరెక్టర్ల మొదటి ఛాయిస్ తమనే.
ఇప్పటికే చేతిలో పెద్ద, మీడియం రేంజ్ సినిమాలు అన్నీ కలిపి దాదాపు 10 వరకు ఉన్నాయి. వాటిలో స్టార్ల సినిమాలే ఎక్కువ. ఇవన్నీ కాకుండా ఇప్పుడు తమన్ మరొక భారీ సినిమా అవకాశాన్ని దక్కించుకున్నాడు. అదే రామ్ చరణ్, శంకర్ సినిమా. తెలుగులో రూపొందుతున్న హై బడ్జెట్ ఎంటర్టైనర్ ఇది. తెలుగుతో పాటు తమిళంలో కూడ మంచి క్రేజ్ ఉండటంతో శంకర్ తమన్ ను చూజ్ చూసుకుని ఉండవచ్చు. అంతేకాదు రామ్ చరణ్ కు కూడ తమన్ అంటే ప్రత్యేక అభిమానం. అందుకే కాబోలు తమన్ ఈ ప్రాజెక్ట్ చేజిక్కించుకోగలిగాడు.