“రాధే శ్యామ్” ఒక్క భాషకు అన్ని వేల థియేటర్లా..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా డస్కీ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన మోస్ట్ అవైటెడ్ చిత్రం “రాధే శ్యామ్”. పాన్ ఇండియన్ లెవెల్లో ఎన్నో అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఇక మామూలుగానే ప్రభాస్ సినిమాలు ఇప్పుడు రిలీజ్ అయితే ఎలా ఉంటుందో తెలిసిందే.

ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో రచ్చే వేరు.. కానీ ఇప్పుడు హిందీలో అయితే ప్రభాస్ మార్కెట్ మన తెలుగు హీరోస్ లో ఇంకా ఎవరికీ లేదు. ప్లాప్ “సాహో” తోనే అక్కడ ప్రాఫిట్స్ లోకి తీసుకొచ్చాడు ప్రభాస్. ఇక ఇప్పుడు రాధే శ్యామ్ తో కూడా మళ్ళీ అంతకు మించిన రెస్పాన్స్ నే అందుకుంటాడని కూడా ఆల్రెడీ కన్ఫర్మ్ అయ్యింది.

అయితే ఇప్పుడు రాధే శ్యామ్ ఒక్క హిందీలోనే ఎన్ని థియేటర్స్ లాక్ అయ్యాయో ఇప్పుడు గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమాని ఒక్క హిందీలోనే ఏకంగా 4000 థియేటర్స్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఏ స్థాయిలో రిలీజ్ అవుతుందో చూడాలి.