Devotional: సాధారణంగా మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత తీర్థప్రసాదాలను స్వీకరిస్తాము. ఈ విధంగా స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత పంచామృతంతో కానీ లేదా తీర్థం కానీ ఇవ్వడం ఆనవాయితీగా ఉంటుంది.ఈ క్రమంలోనే చాలామంది స్వామి వారి తీర్థం తీసుకున్న తర్వాత అదే చేతితో తలపై రాసుకుంటారు.ఇలా రాయటం వల్ల శుభం కలుగుతుందని చాలా మంది భావిస్తారు. నిజంగా తీర్ధం తీసుకున్న తర్వాత ఆ చేతిని తలకి రాసుకుంటే మంచిదేనా? అలా చేయడం వల్ల ఎలాంటి ఫలితాలను పొందవచ్చు అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం…
మనం ఆలయానికి వెళ్లి స్వామివారి దర్శనం చేసిన తర్వాత తీర్థం తీసుకున్నాక ఆ చేతిని తలకి రాయకూడదు. అలా రాయడం ఎంతో అశుభం అని పండితులు చెబుతున్నారు. మనం ఒకసారి తీర్ధం తీసుకున్న తర్వాత మన చేయి ఎంగిలి అవుతుంది. అలాంటి ఎంగిలి చేతితో తలపై తాకడం వల్ల ఎంతో అశుభమని, ఇలా చేయడం వల్ల ఎలాంటి శుభ ఫలితాలు కలుగవని పండితులు తెలియజేస్తున్నారు. అందుకోసమే ఏదైనా తీర్థం లేదా పంచామృతం తీసుకున్నప్పుడు చేతితో తలను తాకకూడదు.
స్వామివారి దర్శనం తర్వాత తీర్థప్రసాదాలు తీసుకున్న వెంటనే చేతిని శుభ్రంగా కడగాలి. కేవలం స్వామివారికి గంగా జలంతో అభిషేకం చేసిన తీర్థాన్ని మాత్రమే మనం తలపై వేసుకోవాలి. కాబట్టి ఎప్పుడూ కూడా తీర్ధం తీసుకున్న తర్వాత ఈ తప్పును ఎవరూ చేయకూడదని పండితులు తెలియజేస్తున్నారు. కనుక ఇప్పటి నుంచి గుడికి వెళ్ళినప్పుడు తీర్థ విషయంలో ఇలాంటి పొరపాట్లు చేయకండి.