Health Tips: మనం ఆరోగ్యంగా ఉండటానికి ఆహారం తీసుకోవడం ఎంతో అవసరం. అలాగే తగినంత సమయం నిద్రపోవడం కూడా అంతే అవసరం. ప్రతిరోజు ఎనిమిది గంటలసేపు తప్పనిసరిగా నిద్రపోవాలి. కానీ ప్రస్తుత కాలంలో పని ఒత్తిడి, నైట్ డ్యూటీలు చేయటం, ఎక్కువ సమయం ఫోన్ లాప్టాప్ చూస్తూ సమయం గడిపేస్తున్నారు. అలా కాకుండా తక్కువ సమయం నిద్రపోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. రోజుకు 6 గంటల కన్నా తక్కువ సమయం నిద్ర పోవడం వల్ల కలిగే దుష్పరిణామాలను గురించి తెలుసుకుందాం.
ప్రతిరోజు సరిపడా సమయం నిద్రపోకపోవటం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. ఈ ఒత్తిడి కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా బీపీ, షుగర్ వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడే వారు కూడా ప్రతి రోజూ 6 నుండి 7 గంటలసేపు తప్పకుండా నిద్రపోవాలి.
బీపీ సమస్యతో బాధపడేవారు తక్కువ సమయం నిద్ర పోవడం ఎలా శరీరంలో బిపి సమస్య పెంచుతుంది. నిద్ర లేకపోవడం వల్ల శారీరక, మానసిక ఒత్తిడికి గురవుతాడు. దీని కారణంగా మెదడు పనితీరు ఒత్తిడి పెరిగి మెదడు పనితీరు సన్నగిల్లుతుంది. అందువల్ల టెన్షన్తో బిపి సమస్య పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
షుగర్ వ్యాధితో బాధ పడేవారు రోజుకు సరిపడా సమయం నిద్రపోకపోవటం వల్ల చట్టంలోనే ఇన్సులిన్ స్థాయి తగ్గుతుంది.ఇన్సులిన్ రక్తంలోని షుగర్ లెవెల్స్ అదుపులో ఉండేలా చేస్తుంది. రక్తంలో ఇన్సులిన్ స్థాయిని తగ్గటం వల్ల షుగర్ లెవెల్స్ అమాంతం పెరిగి పోతాయి. అందువల్ల ప్రతిరోజు 5 గంటల కన్నా తక్కువ సమయం నిద్ర పోతే షుగర్ వ్యాధిగ్రస్తులు ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.