యంగ్ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెర వేర్చుకుంటూ మందుకెళ్తున్న సంగతి తెలిసిందే. రాష్ర్టం పరిస్థితి ఆర్ధికంగా బాగాకపోయినా..అప్పుల్లో కూరుకుపోయినా మాట ఇచ్చి మడం తిప్పడు అన్న చందంగా పనిచేస్తున్నారు. ఇచ్చిన మాట…చేసిన వాగ్ధానాన్ని మర్చిపోకుండా జగన్ మంత్రి వర్గం ముందుకెళ్తోంది. రాష్ర్టాన్ని కరోనా కాటేసినా సరే పథకాల అమలు మాత్ర యాధా విధిగా సాగిపోతుంది. ఇటీవలే విశాఖ గ్యాస్ దుర్ఘటన కారణంగా మృత్యువాత పడిన వారికి కోటి రూపాయలు పరిహారం చెల్లించి ప్రతి పక్షం నొర్ముసుకునేలా చేసారు.
తాజాగా ఆ మధ్య తెలంగాణ లో చోటుచేసుకు దిశ ఘటనతో ఏపీ ప్రభుత్వం కూడా అలెర్ట్ అయిన సంగతి తెలిసిందే. మహిళలపై అఘాయిత్యాలు జరగకుండా ముందుగానే జాగ్రత్తపడదామని సీఏం చర్యలు మహిళలపై. దీనిలో భాగంగా ఇప్పటికే అసెంబ్లీలో దిశ చట్టాన్ని తీసుకొచ్చి సంచలనానికి తెర లేపారు. తాజాగా రాష్ట్రంలోని ప్రతి పార్లమెంటు నియెజకవర్గం పరిధిలో దిశ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. స్టేషన్ లోనే వన్ స్టాప్ సెంటర్, డీ అడిక్షన్ సెంటర్లు కూడా ఏర్పాటు కావాలని దిశా నిర్దేశం చేసారు. ప్రత్యేక కోర్టుల ఏర్పాటు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకాలు త్వరిగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.
అలాగే దిశ యాప్ ను ఎలా వినియోగించాలి అన్న దానిపై ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేయాలని అన్నారు. దిశ యాప్ స్మార్ట్ ఫోన్లలోనే కాకుండా అన్ని ఫోన్లలో కూడా యాప్ సదుపాయాలు ఉండేలా చూడాలని, ఇందుకోసం టెలికాం కంపెనీలతో అధికారులు మాటాడలని సీఎం ఆదేశించారు. దిశ పోలీస్ స్టేషన్ల ఏర్పాటు తోపాటు ఫోరెన్సిక్ ల్యాబ్‌ల నిర్మాణం, మౌలిక సదుపాయాలను వీలైనంత త్వరగా ఏర్పాటు చేసుకోవాలని సిఎం పేర్కొన్నారు.