Home News స్టేడియంలోనే స్టెప్పులేసిన వార్న‌ర్.. బుట్ట‌బొమ్మ అంటూ ర‌చ్చ చేసిన డేవిడ్

స్టేడియంలోనే స్టెప్పులేసిన వార్న‌ర్.. బుట్ట‌బొమ్మ అంటూ ర‌చ్చ చేసిన డేవిడ్

ఒక‌ప్పుడు క్రికెట‌ర్స్ కేవ‌లం త‌న బ్యాటింగ్‌, బౌలింగ్‌తోనే అల‌రించే వారు. కాని ఇప్పుడు ట్రెండ్ మారింది. డ్యాన్స్‌ల‌తోనో లేదంటే మేన‌రిజంతోనే ర‌చ్చ చేస్తున్నారు. కాట్రెయిల్‌, బ్రావో, క్రిస్ గేల్ వంటి వారు గ్రౌండ్‌లో చేసే సంద‌డి మాములుగా ఉండ‌దు. ఇక ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్న‌ర్ కూడా మాములు హ‌డావిడి చేయ‌డు.లాక్ డౌన్ స‌మ‌యంలో టిక్ టాక్ వీడియోలు చేస్తూ ఫుల్ ఎంట‌ర్‌టైన్ చేశాడు. ముఖ్యంగా బుట్ట‌బొమ్మ అనే పాట‌కు త‌న ఫ్యామిలీతో డ్యాన్స్‌లు చేసి అందరు ఫిదా అయ్యేలా చేశాడు.

Dacid D | Telugu Rajyam

ప్ర‌స్తుతం భార‌త్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌ల‌తో బిజీగా ఉన్నాడు వార్న‌ర్. నిన్న భార‌త్- ఆసీస్ మ‌ధ్య తొలి వ‌న్డే జ‌ర‌గ‌గా, ఆ మ్యాచ్‌లో వార్న‌ర్ అర్ధ సెంచ‌రీ చేసాడు. బ్యాట్‌ని ఝుళిపిస్తూ ఫుల్ ఎంట‌ర్‌టైన్ చేసిన వార్న‌ర్ డ్యాన్స్‌తోను సంద‌డి చేశాడు. ఫీల్డింగ్ చేస్తున్న స‌మయంలో ఆడియ‌న్స్ బుట్ట‌బొమ్మ బుట్ట‌బొమ్మ అంటూ కేక‌లు వేస్తుండ‌గా, బౌండ‌రీ లైన్ ద‌గ్గ‌ర నిలుచొన్న వార్న‌ర్ బుట్ట‌బొమ్మ సాంగ్‌కు త‌న‌దైన స్టైల్‌లో స్టెప్పులు వేశాడు. దీంతో వీక్ష‌కులు తెగ గోల చేశారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుండ‌డంతో బ‌న్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

త్రివిక్ర‌మ్ తెర‌కెక్కించిన అల వైకుంఠ‌పుర‌ములో చిత్రం కోసం బుట్ట‌బొమ్మ అనే సాంగ్‌ని థ‌మ‌న్ రూపొందించ‌గా, ఈ సాంగ్‌కు ఎంత భారీ రెస్పాన్స్ వ‌చ్చిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌నక్క‌ర్లేదు. జానీ మాస్ట‌ర్ కొరియోగ్రఫీ కూడా ఈ పాట‌కు ప్ల‌స్ అయింది. అయితే ఇటీవ‌ల ఈ సాంగ్ 450 మిలియ‌న్ వ్యూస్ ద‌క్కించుకోవ‌డంతో డేవిడ్ వార్న‌ర్ అల్లు అర్జున్‌కు శుభాకాంక్ష‌లు తెలిపాడు. కాగా, ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరిగిన తొలి వన్డేలో ఆసీస్‌పై కోహ్లీ సేన 66 పరుగుల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే.

 

 

 

- Advertisement -

Related Posts

2021లో శృతి హాస‌న్ పెళ్లి.. ఈ ప్ర‌శ్న‌పై క‌మ‌ల్ గారాల ప‌ట్టి ఎలా స్పందించిందంటే!

గ‌త ఏడాది నుండి ఇండ‌స్ట్ర‌లో పెళ్ళిళ్ల హంగామా మ‌స్త్ న‌డుస్తుంది. రానా, నితిన్, నిఖిల్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్, నిహారిక‌, సుజీత్ , సునీత ఇలా ప‌లువురు సెల‌బ్రిటీలు త‌మ‌కు న‌చ్చిన వారితో ఏడ‌డుగులు...

పవ‌న్‌ను ఆపలేక చేతులెత్తేసిన వైసీపీ.. మళ్ళీ చంద్రబాబు దగ్గరికే చేరారు 

ఒక వ్యక్తి మీద ఒక విషయంలో ఒక విమర్శ చేయవచ్చు. జనం కూడ దాన్ని వింటారు, పట్టించుకుంటారు.  కానీ అదే వ్యక్తి మీద అన్ని విషయాల్లోనూ ఆ ఒక్క విమర్శనే మళ్ళీ మళ్ళీ...

తూ.గో.జిల్లాను దడదడలాడిస్తూనే ఎమ్మెల్యే.. వైసీపీ నేతలు సైతం సైలెంట్ 

వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు కొందరు జగన్ అండ చూసుకుని హద్దులు దాటిపోతున్న సంగతి తెలిసిందే.  ఇలాంటివారి మూలంగా ఇతర వైసీపీ ఎమ్మెల్యేలే ఇబ్బందులుపడుతున్నారు.  బయటివారినే కాదు సొంత పార్టీ నేతలను కూడ ఈ ఎమ్మెల్యేలు లెక్కచేయట్లేదు.  అంతా...

ఐశ్వ‌ర్యరాయ్ నా త‌ల్లి అంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన కుర్రాడు

సెల‌బ్రిటీల పేరు ప్ర‌ఖ్యాత‌ల‌ను నాశ‌నం చేసేందుకు కొంద‌రు కంక‌ణం క‌ట్టుకొని అదే ప‌నిలో ఉంటారు. వారి గురించి చెడు ప్ర‌చారాలు చేయ‌డం, లేదంటే క‌ట్టు క‌థ‌లు అల్లి వారి ఇమేజ్ డ్యామేజ్ చేయాల‌ని...

Latest News