Robinhood : ప్రీ రిలీజ్ బిజినెస్‌తో దూసుకెళ్తున్న నితిన్.. టాప్ లెవెల్లో రాబిన్ హుడ్

యూత్‌ఫుల్ హీరో నితిన్ తన కెరీర్‌ను మళ్లీ పట్టాలెక్కించేందుకు ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా పనులు చేస్తున్నాడు. తాజాగా ఆయన హీరోగా నటించిన ‘రాబిన్ హుడ్’ సినిమా మార్చి 28న థియేటర్లలో విడుదల కాబోతోంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్‌పై ఇప్పటికే మంచి బజ్ నెలకొంది. ప్రమోషనల్ కంటెంట్, క్రికెటర్ డేవిడ్ వార్నర్ స్పెషల్ క్యామియో వంటి అంశాల వల్ల సినిమా మీద ఆసక్తి పెరిగింది.

తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు రూ. 27.50 కోట్లు రావడం విశేషం. నితిన్ కెరీర్‌లో ఇదే బిగ్గెస్ట్ బిజినెస్‌గా నిలిచింది. గతంలో నితిన్ చేసిన ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ రూ. 24.20 కోట్ల బిజినెస్ సాధించగా, అది ఆశించిన స్థాయిలో రాబడి ఇవ్వలేదు. అలాగే ‘మాచర్ల నియోజకవర్గం’ రూ. 21.20 కోట్లు, ‘రంగ్ దే’ రూ. 23.90 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. కానీ ఫైనల్ వసూళ్లలో అంచనాల స్థాయికి వెళ్లలేకపోయాయి.

‘చెక్’ సినిమా రూ. 16 కోట్లకు సరిపోగా, ‘భీష్మ’ మాత్రం మంచి విజయం సాధించి రూ. 21.80 కోట్ల బిజినెస్‌ను సమర్థంగా రికవర్ చేసింది. ఇక ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమాకూ రూ. 25.80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినా, బాక్సాఫీస్ వద్ద తక్కువే సంపాదించింది. దీంతో నితిన్‌కు గత కొంతకాలంగా ఫ్లాపులు ఎక్కువవుతున్నా, మార్కెట్‌పై ప్రభావం తగ్గలేదనే చెప్పాలి. ఇప్పుడు రాబిన్ హుడ్‌తో మళ్లీ మాస్ ఆడియెన్స్‌ను టార్గెట్ చేస్తున్నాడు.

ఈసారి మాత్రం నితిన్‌కు కమర్షియల్‌గా ఓ బ్లాక్‌బస్టర్ అవసరం. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా, జివి ప్రకాష్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా నితిన్ కెరీర్‌లో బిగ్ రికార్డ్ గా నిలవాలని అభిమానులు ఆశిస్తున్నారు. 27.50 కోట్ల బిజినెస్‌ను రికవర్ చేయాలంటే వర్డ్ ఆఫ్ మౌత్ బలంగా ఉండాలి. మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ వస్తే, నితిన్ మరోసారి తన ఫామ్‌కు తిరిగొచ్చినట్టే.

తిట్టడానికి అసలు కారణం ఇదే! Dasari Vignan About Rajendra Prasad Comments on David Warner | TR