Curd: పెరుగు తినాలి.. కానీ ఈ ఆహార పదార్ధాలతో తినొద్దు..!! తింటే..

Curd: భోజనం ఎన్ని కూరలతో తిన్నా చివరన పెరుగు లేకపోతే మనకు సంతృప్తి ఉండదు. చిన్నారులకు కూడా తల్లి తినిపించే గోరుముద్దల్లో పెరుగు తప్పనిసరి. పెరుగు మన ఆరోగ్యానికి అంత మంచి చేస్తుంది కాబట్టి.. పెరుగు మనకు చాలా ముఖ్యం. అంతే ఇష్టంగా తింటాం కూడా. గడ్డ పెరుగును చూస్తూ అన్నంలో కాదు.. అలా గరిటతోనో.. స్పూన్ తోనో నోట్లో వేసుకుని లాగించకుండా ఉండలేం. అన్ని పోషకాలిచ్చే పెరుగును ఎలా తిన్నా ఓకే కానీ.. కొన్ని ఆహార పదార్ధాలతో తీసుకుంటే మాత్రం ఆరోగ్యాని చేటు చేస్తుంది.

పెరుగన్నంలో ఉల్లిపాయ నంజుకుని చాలామంది ఇష్టంగా తింటారు. చలవ చేస్తుందని చెప్తారు కూడా. కానీ ఆరోగ్యానికి చాలా హానికరం అంటోంది ఆయుర్వేదం. పెరుగు ప్రభావం చల్లగా ఉంటే.. ఉల్లిపాయ ప్రభావం వేడిగా ఉంటుంది. పైగా.. అలర్జీ వచ్చే అవకాశం ఉంది. దద్దుర్లు, తామర, సోరియాసిస్, గ్యాస్, వాంతుల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని ఆయుర్వేదం చెప్తోంది. పెరుగుతో పాలను కలిపి కూడా తినొద్దంటున్నారు. పాల నుంచే పెరుగు తయారవుతున్నా ఆయుర్వేదం ప్రకారం ఈ రెండింటినీ కలిపి తినొద్దంటోంది. ఇలా తినడం వల్ల కడుపు నొప్పి, అతిసారం, అజీర్ణం సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది.

మామిడిని ఎంతో ఇష్టంగా తింటాం. పెరుగన్నంలో మామిడిని కూడా ఎంతో ఇష్టంగా తింటాం. ఇది ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు. దీనివల్ల చర్మ వ్యాధులు వస్తాయని తెలీక టేస్ట్ బాగుందని తినేస్తాం. జీర్ణవ్యవస్థలో కూడా మార్పులు వస్తాయంటున్నారు. చేపలను ఎంతో ఇష్టంగా తింటాం. కానీ.. రెండింటినీ కలిపి తినకూడదని పెద్దలే చెప్పారు. ఇప్పుడు హెల్త్ సైన్స్ ప్రకారం ఒకేసారి ప్రోటీన్ లు అధికంగా ఉండే రెండు ఆహారాలను తినడం కరెక్ట్ కాదు. దీనివల్ల అజీర్ణం, కడుపు నొప్పి సమస్యలు వస్తాయి.

పెరుగులో ఉండే పోషకాలు మనలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కాల్షియం అధికంగా ఉంటుంది కాబట్టి ఎముకలను బలంగా ఉంచుతుంది. విటమిన్ బి2, విటమిన్ బి 12, మెగ్నీషియం, పొటాషియం, ప్రోటీన్ కూడా పెరుగులో పుష్కలం. ఇన్ని పోషకాలున్న పెరుగును తినకుండా ఉండగలమా? పెరుగులో పంచదార కలుపుకుని తిన్నా ఆ మజానే వేరు. అందుకే పెరుగు తినాలి.. కానీ పైన పేర్కొన్న పద్ధతుల్లో మాత్రం కాదు..!

 

గమనిక: ఈ వివరాలు మీ అవగాహన కోసం మాత్రమే. పలు సందర్భాల్లో ఆహార నిపుణులు, వైద్యులు అందించిన వివరాలనే ఇక్కడ ఇచ్చాం. మీ ఆరోగ్యం విషయంలో ఎటువంటి సమస్య ఉన్నా, సలహాలకైనా వైద్యులను, ఆహార నిపుణులను సంప్రదించడమే ఉత్తమం. మీ ఆరోగ్యానికి సంబంధించి ‘తెలుగు రాజ్యం’ ఎటువంటి బాధ్యత వహించదు. గమనించగలరు.