పచ్చి ఉల్లిపాయ తింటే ఎన్ని లాభాలో.. షుగర్, ఊబకాయం, హృదయ సమస్యలు దూరం..!

ప్రతి ఇంట్లోనూ తప్పనిసరిగా ఉండే పదార్థం ఉల్లిపాయ. రుచి కోసం వంటల్లో వేస్తారనే అభిప్రాయం చాలామందిలో ఉన్నా, దాని వెనక ఉన్న ఆరోగ్య రహస్యాలు ఎంతో గొప్పవని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ ఒక ఉల్లిపాయ తినడం ద్వారా శరీరానికి ఎన్నో ప్రయోజనాలు లభిస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి. ఉల్లిపాయలో ఉన్న బయోటిన్ అనే మూలకం రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.

దీని వల్ల షుగర్ సమస్యలు నియంత్రణలో ఉంటాయి. అందుకే డయాబెటిస్ ఉన్నవారు ఆహారంలో ఉల్లిపాయను తప్పనిసరిగా చేర్చాలని సూచిస్తున్నారు. అదేవిధంగా రక్తంలో కొలెస్టరాల్‌ను తగ్గించి హృదయ సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడుతుంది. హార్ట్ ఎటాక్, స్ట్రోక్ వంటి సమస్యల రిస్క్‌ను కూడా తగ్గిస్తుంది.

రోజూ ఉల్లిపాయ తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జలుబు, దగ్గు, శ్వాస సంబంధిత సమస్యలు దూరమవుతాయి. ఉల్లిపాయలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు శరీరంలో నొప్పులు, దురదలను తగ్గిస్తాయి. అంతేకాదు శరీరంలో ఫ్రీ రాడికల్స్‌ను తగ్గించి వృద్ధాప్యాన్ని ఆలస్యం చేస్తుంది. ఉల్లిపాయలోని విటమిన్ సి చర్మకాంతిని పెంచుతుంది. ముడతలు తగ్గి చర్మం ఆరోగ్యంగా మారుతుంది. అదనంగా కొన్ని రకాల కేన్సర్ రిస్క్‌లను కూడా ఉల్లిపాయ తగ్గించగలదని పరిశోధనలు చెబుతున్నాయి. బరువు తగ్గాలనుకునేవారికి కూడా ఇది ఒక సహజ ఔషధం. ఉల్లిపాయ మెటబాలిజం పెంచి అధిక బరువును తగ్గించడంలో సహాయపడుతుంది.

అలాగే ఎర్రగడ్డలు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. వీటిలో ఉన్న సహజ ఫైబర్ ఆహారం సులభంగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. అంతేకాదు ఎముకలను బలపరచడంలో కూడా ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. రోజుకు ఒక ఉల్లిపాయ తినే అలవాటు మన ఆరోగ్యాన్ని కాపాడడమే కాకుండా అనేక వ్యాధుల ముప్పును తగ్గిస్తుంది. రుచి కోసం వంటల్లో వేసే ఉల్లిపాయే మన శరీరానికి అద్భుతమైన ఔషధమని నిపుణులు సూచిస్తున్నారు.