ఏపీ టుడే : ఒక్క‌రోజులోనే రికార్డు స్థాయిలో..క‌రోనా పేషెంట్లు డిశ్చార్జ్ ..!

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు పెద్ద ఎత్తున న‌మోద‌వుతున్నా.. కరోనా నుండి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతుండ‌డం, రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ఊర‌టినిస్తుంది. ఇక గ‌త 24 గంట‌ల్లో ఏపీలో 60,797 శ్యాంపిళ్ళ‌ను ప‌రీక్షించ‌గా, కొత్త‌గా 9,276 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌వ‌గా, 58 మంది క‌రోనాతో పోరాడుతూ ప్రాణాలు విడిచారు. ఇక ఒక్క‌రోజులోనే రాష్ట్రంలో 12,750 మంది క‌రోనా నుండి కోలుకుని ఆస్ప‌త్రుల నుండి డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో ప్ర‌స్తుతం ఏపీలో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 1,50,209కి చేరుకుంది. ఇక మొత్తంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా కార‌ణంగా 1,407 మంది ప్రాణాలు కోల్పోగా, 76,614 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ప్ర‌స్తుతం ఏపీలో 72,188 మంది క‌రోనా రోగులు చికిత్స పొందుతున్నారు. ఇక ఏపీలో ఇప్పటివరకు నిర్వహించిన మొత్తం పరీక్షల సంఖ్య రికార్డు స్థాయిలో 20,12,573కి చేర‌డం విశేషం.