కేటీఆర్ సీఎం కాబోతున్నారు.. ఇదిగోండి ప్రూఫ్ 

Clear indication on KTR as next CM
తెరాసలో ఎన్నాళ్ళ నుండి ముఖ్యమంత్రి మార్పు విషయమై సమగ్ర చర్చ నడుస్తూనే ఉంది.  కేసీఆర్ నెలలో ఎక్కువ రోజులు ఫామ్ హౌస్లోనే  గడుపుతుండటంతో తనయుడు, మంత్రి కేటీఆరే పార్టీ, పాలన బాధ్యతలను చూసుకునేవారు.  హోదాకు మించి పనులను చక్కబెట్టేవారు.  రెండవసారి ముఖ్యమంత్రి అయ్యాక కేసీఆర్ దూకుడును కాస్త తగ్గించారు.  ఎక్కువగా బయట కనిపించకుండా పనులన్నీ కేటీఆర్ చేతుల మీదనే జరిగేలా చేశారు.  తనయుడిని  ముఖ్యమంత్రిని చేయాలంటే ముందుగా సొంత పార్టీ నేతలను సిద్ధం చేసుకోవాలనుకున్న కేసీఆర్ కుమారుడ్ని వారి మధ్యలోనే వదిలేసి పూర్తిగా వెనక్కు తగ్గారు.  కేటీఆర్ సైతం అందరికీ తలలో నాలుకలా కలిసిపోయి మద్దతు కూడగట్టుకున్నారు. 
 
Clear indication on KTR as next CM
Clear indication on KTR as next CM
ఇప్పటికిప్పుడు చూసుకున్నా తెరాసలో  కేటీఆర్ ముఖ్యమంత్రి అవడం పట్ల ఎవరికీ అభ్యంతరాలు లేవు.  మెజారిటీ నేతలు కేటీఆర్ నాయకత్వాన్ని స్వాగతిస్తున్నారు.  దీంతో కుమారుడిని ముఖ్యమంత్రిని చేసి తాను ఢిల్లీకి వెళ్లి థర్డ్ ఫ్రంట్ పెట్టుకుంటే లెక్క సరిపోతుందని కేసీఆర్ ప్లాన్ చేసుకున్నారు.  ఆ ప్రకారమే కేటీఆర్ త్వరలో ముఖ్యమంత్రి కానున్నారని అందరికీ లీకులు వదిలేశారు.  ఎక్కడా అధికారికంగా చెప్పకుండా సొంత నాయకుల చేత కేటీఆర్ ను సీఎం ఎలెవల్లో ఎలివేటి చేయిస్తూ ప్రజల్లో కేటీఆర్ ముఖ్యమంత్రి కానున్నారనే చర్చ పెద్ద ఎత్తున నడిచేలా చేశారు.  ప్రజలు కూడ దాదాపు కేటీఆరే మన తర్వాతి సీఎం అనే అభిప్రాయానికి వచ్చేశారు. 
 
ఇంతవరకు భాగానే జరిగినా మధ్యలో దూసుకొచ్చిన బీజేపీ దుబ్బాకలో విజయం సాధించి, గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చూపించి గులాబీ బాసును బెంబేలెత్తించింది.  దీంతో కేసీఆర్ పూర్తిగా యాక్టివ్ అటు ఢిల్లీ పర్యటనలు, ప్రజలను, ఉద్యోగులను మచ్చిక చేసుకునే కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు.  దీంతో కేటీఆర్ సీఎం అయ్యే ఎపిసోడ్ ఇప్పట్లో ఉండదని అంతా అనుకున్నారు.  పార్టీ కష్టాల్లో ఉందని,ఇప్పడు గనుక కేసీఆర్ పగ్గాలు వదిలేస్తే మరింత కుంగిపోతుందనే అభిప్రాయానికి వచ్చారు.  ఇది కేటీఆర్ సామర్థ్యం మీద నెగెటివిటీని పెంచసాగింది.  దీంతో మళ్ళీ కేటీఆర్ ముఖ్యమంత్రి కానున్నారని ప్రచారం మొదలైంది. 
 
ఈసారి వాళ్ళు వీళ్ళు కాదు ఏకంగా తెరాస ముఖ్య నేతలే కేటీఆర్ సీఎం కావడం పట్ల స్పందిస్తున్నారు.  మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ తమ దగ్గర 99 శాతం కార్యక్రమాల్ని మంత్రి కేటీఆర్ చూస్తారని.. ముఖ్యమంత్రి అందుబాటులోలేని సమయంలో ఆ పాత్రను కేటీఆర్ పోషిస్తున్నారని ఆయన సీఎం అయ్యే రోజు తొందర్లోనే ఉందని సంకేతాలిచ్చారు.  చూడబోయే ఇంకొన్ని నెలలో కేటీఆర్ సీఎం పీఠాన్ని అధిరోహించడం ఖాయంగా కనిపిస్తోంది.