2019 ఎన్నికల్లో వచ్చిన ఓటమిని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంకా అంగీకరించలేకపోతున్నారు.గడిచిన ఐదేళ్లలో ఎన్నో అభివృద్ధి పనులు చేసినా కూడా ఎందుకు ఓడిపోవలసి వచ్చిందోనని ఎన్నికల ఫలితాల తరువాత చాలా రోజుల ఆరా తీశారు. ఆ ఓటమిని అంగీకరించడానికి సమయం తీసుకున్న చంద్రబాబు ఇప్పుడు అమరావతి విషయంలో అసలైన రాజకీయాన్ని ప్రారంభించారు. నిన్న ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ మీడియా సమావేశంలో వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కేవలం స్వప్రయోజనాల కోసం రాజధానిని మార్చడం సరికాదని, అమరావతి రైతులను మోసం చేయడం తగదని పేర్కొన్నారు.
తాము అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధిని వివరిస్తూ…విభజన తర్వాత 16 వేల కోట్ల లోటు బడ్జెట్‌తో వచ్చినా కూడా అభివృద్ధిలో వెనుకడుగు వేయలేదన్నారు. రామాయపట్నం, బందర్, కాకినాడ, బావనపాడు పోర్టులకు నాంది పలికామని, గోదావరి మిగులు జలాలతో రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడానికి బాటలు వేశామన్నారు. పోలవరం 72 శాతం పూర్తి చేశామని, 62 ప్రాజెక్ట్‌లకు నాంది పలికామని వివరయించారు. అలాగే వైసీపీ అధికారంలోకి వచ్చిన 14 నెలలో వైసీపీ చేసిన అభివృద్ధి ఏంటో ప్రజలకు వివరించాలని సీఎం జగన్ ను చంద్రబాబు డిమాండ్ చేశారు.
రాజధాని నిర్మాణం కోసం అమరావతిలో భూములు ఇచ్చిన రైతుల జీవితంతో ఆటలు ఆడుకోవద్దని తెలిపారు. వాళ్ళ ప్రాణాలు పోతున్న జగన్ పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించారు. కరోనా విషయంలో కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని, తాము హెచ్చరించినప్పుడు తమను వైసీపీ నాయకులు అవహేళన చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓడిపోయిన చంద్రబాబు మొదటిసారి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టె ప్రశ్నలు సంధించారని, బాబు ఇప్పుడు అసలైన రాజకీయం స్టార్ట్ చేశారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.