సొంత నేతను అదుపు చేయలేక చేతులు ఎత్తేసిన చంద్రబాబు

అమరావతి: టీడీపీ నాయకులపై కేశినేని నాని చేస్తున్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో, టీడీపీ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. టీడీపీ లొనే ఉంటూ టీడీపీ నాయకులను మంత్రి కేశినేని నాని తరచు విమర్శిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం మాజీ మంత్రి దేవినేని ఉమ, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నలపై ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

చంద్రబాబు నాయిడు పార్టీలో గెలిచిన వారి కంటే కూడా ఓడిపోయిన నాయకులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, గెలిచిన వారిని పట్టించుకోవడం లేదని వెల్లడించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ ధాటికి తట్టుకొని, గెలిచిన తనకు పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడం లేదని సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై కూడా సోషల్ మీడియాలో ఘాటు వ్యాఖ్యలు చేశారు.

మన కలలను మనమే సాకారం చేసుకోవాలి, వాటి కోసం వేరేవాళ్లను అడగడం తగదని, టీడీపీ నాయకులు అందరూ కలిసి కట్టుగా పనిచేస్తూ 2024లో అధికారంలోకి రావాలని, ప్రెస్ మీట్, మీటింగ్ ల వల్ల ఒరిగేదేమీ లేదని ట్వీట్ చేశారు. అయితే ఇప్పటి వరకు నానిపై చంద్రబాబు ఎలాంటి క్రమ శిక్షణా చర్యలు తీసుకోకపోవడం వల్ల నాని విషయంలో చంద్రబాబు చేతులు ఎత్తేశారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నాని వ్యాఖ్యలు కొంచెం ఘాటుగా ఉన్న కూడా అందులో నిజం ఉందని టీడీపీలోని కొంత మంది నాయకులు అనుకుంటున్నారు.

వ్యాఖ్యలు కొంచెం ఘాటుగా ఉన్న అందులో నిజం ఉంది కాబట్టి చంద్రబాబు నాని వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకుంటాడో లేదో వేచి చూడాలి. అయితే నాని చేస్తున్న ఘాటు వ్యాఖ్యలను ఆధారంగా చేసుకొని కొందరు వైసీపీ నాయకులు చంద్రబాబు తన నాయకులనే అదుపులో పెట్టుకోలేకపోతున్నారని, ఇంక రానున్న రోజుల్లో పార్టీని కూడా నడపలేరని వ్యాఖ్యానిస్తున్నారు. 2019 ఎన్నికలే టీడీపీకి చివరి ఎన్నికలని, మళ్ళీ టీడీపీ అధికారంలోకి రావడమనేది కలేనని వైసీపీ నాయకులు చర్చించుకుంటున్నారు.