బొద్దుగుమ్మ బికినీపై భయంకరమైన ట్రోలింగ్

విద్యుల్లేఖరామన్.. అటు తమిళంలోనూ, ఇటు తెలుగులోనూ నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. హాస్య నటిగా ఆమెకు అంత పాపులారిటీ రావడానికి కారణం, ఆమె బొద్దుతనమే. ఆ మధ్య బాగా కష్టపడి కాస్త సన్నబడింది. మొన్నీమధ్యనే పెళ్ళి కూడా చేసేసుకుంది. అదీ అత్యంత సన్నిహితుల సమక్షంలోనే.

అసలు విషయమేంటంటే, ఈ బ్యూటీ తాజాగా తన భర్తతో కలిసి విహార యాత్రకు వెళ్ళింది. ఈ క్రమంలో కొన్ని ఫొటోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వాటిల్లో ఆమె ధరించిన బికినీ గురించి సోషల్ మీడియా వేదికగా రచ్చ రచ్చ అవుతోంది.

‘నీ భర్తని ఎప్పుడు వదిలేస్తున్నావ్.?’ అంటూ కొందరు నెటిజన్లు ఆమెను ప్రశ్నించారు. దాంతో, విద్యుల్లేఖకు ఒళ్ళు మండిపోయింది. ‘నన్ను అర్థం చేసుకునే వ్యక్తి నాకు భర్తగా వచ్చాడు. స్త్రీ వ్యక్తిత్వాన్ని ఆమె ధరించే దుస్తుల్ని బట్టి డిసైడ్ చేయొద్దు. పద్ధతిగా చీరకట్టుకుని సంసార జీవితాన్ని సాగించే మహిళల్లో ఎంతమంది విడాకులు తీసుకోవడంలేదు.?’ అంటూ విద్యుల్లేఖ కస్సుబుస్సులాడింది.

నిజమె, అలల మధ్యన సేద తీరేటప్పుడు స్విమ్ సూట్ ధరించడంలో తప్పేముంది.? స్విమ్మింగ్ పూల్‌లో చీరకట్టుకుని స్విమ్మింగ్ చేయరు కదా.?