Breaking Jagan Govt : భారత దేశ వ్యాప్తంగా కూడా సినిమా పరిస్థితి ఒకలా ఉంటే ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం పరిస్థితి ఇంకోలా ఉంది. అకస్మాత్తుగా ఏపీ ప్రభుత్వం తెలుగు సినిమాలో జోక్యం చేసుకోవడం అనేక సంచలనాలకు దారి తీయగా వాటిలో టికెట్ ధరలను మ్యానేజ్ చెయ్యాలి అని చూసిన అంశం పెద్ద కాంట్రవర్సీకి దారి తీసింది.
ఇక దీనిపై చేసేది ఏమి లేదని థియేటర్స్ వారు కోర్టును ఆశ్రయించగా దానికి గాను రివర్స్ లో థియేటర్స్ పై కఠిన చర్యలు తీసుకునే విధంగా రైడ్ లి నిర్వహించారు. మరి ఈ సమయంలో రూల్స్ పాటించడం లేదని మొత్తం రాష్ట్ర వ్యాప్యంగా అనేక థియేటర్స్ ని ఏపీ ప్రభుత్వం సీజ్ చేసింది.
దీనితో ఆ భయం వల్లనో లేక వేరే కారణం ఏమో కానీ టికెట్ ధరల వల్ల మూసేస్తున్నాం అని దాదాపు 200 దగ్గరకు థియేటర్స్ మూసేయడం జరిగింది. ఇక ఇప్పుడు ప్రభుత్వం చేత సీజ్ చెయ్యబడ్డ థియేటర్స్ విషయంలో వారు సంచలన నిర్ణయం తీసుకోవడం హాట్ టాపిక్ గా మారింది.
తాము సీజ్ చెయ్యబడ్డ థియేటర్స్ ని మళ్ళీ తెరవడానికి అనుమతిని ఇస్తూ ఆదేశాలు జారీ చేసారు. మొదటగా ఆల్రెడీ 83 థియేటర్స్ మూత పెద్దవి తెచుకున్నాయట. అలాగే దీనిపై ఎవరైనా తెరవాలి అనుకుంటే ముందు జిల్లా కలెక్టర్ దగ్గర దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కానీ టికెట్ రేట్స్ విషయంలో మాత్రం ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.