ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకంగా 1,26,000 కు పైగా గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగాల భర్తీ జరిగింది. సచివాలయ ఉద్యోగులలో 80 శాతం మందికి ప్రొబేషన్ డిక్లేర్ కాగా 20 శాతం మందికి మాత్రం ప్రొబేషన్ ఎప్పటికి డిక్లేర్ అవుతుందనే ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు. గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగులకు జగన్ సర్కార్ అన్యాయం చేస్తోందా? అనే ప్రశ్నకు ఎక్కువమంది అవుననే సమాధానం చెబుతున్నారు.
ప్రభుత్వ విధి, విధానాల వల్ల ప్రభుత్వ ఉద్యోగులపై తీవ్రస్థాయిలో భారం పడుతోంది. ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రొబేషన్ డిక్లేర్ చేసే అవకాశాలు ఉన్నాయని జరుగుతున్న ప్రచారం ఉద్యోగులను మరింత టెన్షన్ కు గురి చేస్తోంది. ఉద్యోగుల విషయంలో జగన్ సర్కార్ ఏ విధంగా ముందుకు వెళ్లాలని భావిస్తుందో తెలియడం లేదు. జగన్ సర్కార్ ఉద్యోగాల భర్తీ వల్ల భారం పెరుగుతోందని భావిస్తోంది.
కొత్త ఉద్యోగాల భర్తీ దిశగా అడుగులు వేస్తే మాత్రం ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని జగన్ సర్కార్ భావిస్తోందని సమాచారం. ఇప్పట్లో కొత్త ఉద్యోగాల భర్తీ అయితే లేనట్టేనని బోగట్టా. జగన్ సర్కార్ ప్లానింగ్ ఏ విధంగా ఉండబోతుందో చూడాల్సి
ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు సైతం జగన్ సర్కార్ పై మండిపడుతున్నారు. తమకు సకాలంలో జీతాలు చెల్లించడం లేదని వాళ్లు ఆందోళన చెందుతున్నారు.
జగన్ సర్కార్ సైతం ఉద్యోగుల విషయంలో ఇంత కఠినంగా ఎందుకు వ్యవహరిస్తుందో అర్థం కావడం లేదు. ఇతర పార్టీల నుంచి జీతాల విషయంలో నెగిటివ్ కామెంట్లు వినిపిస్తున్నా ఆ కామెంట్లను ఎక్కువమంది పట్టించుకోవడం లేదు. జగన్ సర్కార్ ప్రణాళికలు, వ్యూహాలు అర్థం కావడం లేదని రాజకీయ విశ్లేషకులు కామెంట్లు చేస్తున్నారు.