పింఛన్ పంపిణీ విషయంలో జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం..?

వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎన్నో పథకాలను అమలులోకి తీసుకు వచ్చాడు. ఈ పథకాల ద్వారా అర్హులైన ప్రజలందరూ ఎన్నో ప్రయోజనాలు పొందుతున్నారు. విద్యార్థులకు, రైతులకు, కూలీలకు ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ అన్ని పథకాలు చేకూరేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముఖ్యంగా పింఛన్ పంపిణీ విషయంలో జగన్ ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. గతంలో పింఛన్ తీసుకోవటానికి వృద్ధులు చాలా దూరం వెళ్ళవలసి వచ్చేది. కానీ వృద్ధులకు ఆ ప్రయాణ భారాన్ని తగ్గించేందుకు జగన్ ప్రభుత్వం వాల్టీర్లను ఇంటి వద్దకే పంపి పింఛన్ పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాడు. దీని ద్వారా వృద్ధులకు ఊరట లభించింది.

అయితే పింఛన్ పంపిణీ సమయంలో వృద్ధులకు వేలిముద్రలు పడకపోవటం వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అంతేకాకుండా సమయం కూడా వృధా అవుతోంది. పింఛన్ల పంపిణీ సమయంలో వృద్ధులకు ఏర్పడే పలు సమస్యలకు చెక్ పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వృద్ధులకు వేలిముద్రలు పడకపోవడంతో పింఛన్ పంపిణీలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో ఈ సమస్యలకు చెక్ పెట్టడానికి ఆధార్ అనుసంధానంతో లబ్ధిదారుడి ఫేస్​ను యాప్​లో సరిపోల్చుకుని పెన్షన్ పంపిణీ చేయాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇక మార్చి 1వ తేదీ నుంచి ఈ విధానాన్ని అమలులోకి తీసుకురానుంది.

మార్చి 1 వ తేది పింఛన్లు పంపిణీ సమయంలో ఫేస్ రికగ్నిషన్​​తో పాటు వేలిముద్రల విధానం, ఇతర పద్ధతులు కూడా కొనసాగుతాయని జగన్ ప్రభుత్వం తెలిపింది. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్టుగా ఏడాదికి ఒకసారి 250 రూపాయలు చెప్పిన పింఛన్ పెంచుతున్నారు. ఇక ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి వృద్ధాప్య పింఛన్​ను రూ.2250 నుండి రూ.2,750కి పెంచింది. రూ.250 పెంచి రూ.2,750 కి పెందించి. రాష్ట్రంలో మొత్తంగా 64.74 లక్షల మందికి పింఛన్లు అందిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. దీంతో ప్రతి నెలా పెన్షన్ల కోసం రూ.1,786 కోట్లకు ఖర్చు చేస్తోంది.