ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ మహిళలకు ప్రయోజనం చేకూరేలా ఎన్నో స్కీమ్స్ ను అమలు చేస్తోంది. జగన్ సర్కార్ అమలు చేస్తున్న స్కీమ్స్ లో అమ్మఒడి స్కీమ్ కూడా ఒకటి. పిల్లల చదువులకు ఏ పేదింటి తల్లి భయపడకూడదనే ఆలోచనతో జగన్ సర్కార్ ఈ స్కీమ్ ను అమలు చేస్తోంది. పిల్లలను బడికి పంపితే సంవత్సరానికి 15000 రూపాయల చొప్పున నగదు ఖాతాలో జమ కావడం జరుగుతుంది.
పేద మహిళలకు ప్రయోజనం చేకూరేలా పార్టీలు, కులాలు, మతాలతో సంబంధం లేకుండా జగన్ సర్కార్ పక్కా ఇళ్లను కట్టిస్తోంది. ఐదు సంవత్సరాలలో జగన్ సర్కార్ ఏకంగా 25 లక్షల పక్కా ఇళ్లను కట్టించడానికి సిద్ధమవుతోంది. ఇళ్ల స్థలాలు లేని నిరు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు మహిళల పేర్లపై రిజిస్ట్రేషన్ చేస్తూ ప్రభుత్వం ఇళ్లు కూడా కట్టిస్తుండటం గమనార్హం.
ఎన్నో కుటుంబాలు మద్యం వల్ల నాశనం అవుతున్న నేపథ్యంలో జగన్ సర్కార్ మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేస్తుండటం గమనార్హం. మద్యం రేట్లను పెంచడంతో పాటు దశల వారీగా మద్యాన్ని నిషేధించే దిశగా జగన్ సర్కార్ అడుగులు వేస్తోంది. మహిళల కోసం జగన్ సర్కార్ వైఎస్సార్ ఆసరా , వైఎస్సార్ చేయూత పథకాలను సైతం అమలు చేస్తుండటం గమనార్హం.
ఈ స్కీమ్స్ ద్వారా పొదుపు సంఘాల రుణాల మొత్తం డ్రాక్రా మహిళలకు అందడంతో పాటు వైస్సార్ చేయూత స్కీమ్ ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు జగన్ సర్కార్ ప్రయోజనం చేకూర్చుతోంది. ఓసీ మహిళల కోసం జగన్ సర్కార్ వైఎస్సార్ కాపునేస్తం స్కీమ్ ను అమలు చేస్తోంది. జగన్ సర్కార్ స్కీమ్స్ వల్ల మహిళలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో బెనిఫిట్ కలుగుతుండటం గమనార్హం.