అమరావతి:2019 ఎన్నికల్లో ఓడిపోవడానికి ముందు వరకు రాష్ట్రంలో టీడీపీ నాయకులు వైసీపీ నాయకులతో 20-20 ఆడుకున్నారు. టీడీపీ చేస్తున్న పనులకు గత బీజేపీ నాయకుడైన కన్నా లక్ష్మీ నారాయణ కూడా వంత పలకడంతో టీడీపీకి అడ్డు చెప్పడానికి ఎవ్వరూ ఉండేవారు కాదు. అయితే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా తలకిందులు అయ్యాయి. వైసీపీ అనూహ్యమైన గెలుపుతో టీడీపీ కొలుకోలేన్నంత డీలా పడిపోయింది. ఇదిలా ఉండగా సోము వీర్రాజు రూపంలో టీడీపీ నాయకులకు కొత్త సమస్య ఎదురైంది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీ నారాయణను తొలగిస్తూ, సోము వీర్రాజును బీజేపీ పెద్దలు నియమించారు. కన్నా లక్ష్మీ నారాయణ చంద్ర బాబు చెప్పినట్టు వినేవాడు, ఇప్పుడు సోము మాత్రం బాబు మాట అస్సలు వినడనేది నూటికి నూరు శాతం నిజం. దీంతో తమతోపాటు నడిచే ఒక మిత్రుణ్ణి కోల్పోయామని టీడీపీ పెద్దలు బాధపడుతున్నారు. అయితే సోమును కూడా మచ్చిక చేసుకోవడానికి రాజ్య సభ ఎంపీ సుజనా చౌదరి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు కాని అవేవి ఫలించడం లేదు. సోము అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత కలవడానికి ప్రయత్నించిన చౌదరికి సోము అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదని రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట.
సోమును కలవడానికి చౌదరి ఏకంగా అమిత్ షా నుండి అనుమతి తీసుకోవడానికి ప్రయత్నించడంటా, అయితే అమిత్ షా కరోనా భారిన పడటంతో , సుజనా తానే స్వయంగా ప్రయత్నించి అవమాన పడ్డాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. వైసీపీ విజయంతో రాష్ట్రంలో ఇప్పుడు టీడీపీ, బీజీపీ ఒకే స్థాయిలో ఉన్నాయి. రానున్న రోజుల్లో సోము తీసుకునే అనూహ్యమైన నిర్ణయాల వల్ల టీడీపీ నాయకులు ఇంకెన్ని సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందోనని చర్చలు జరుగుతున్నాయి. పార్టీ పగ్గాలు చేపట్టిన కొన్ని గంటల్లోనే చంద్రబాబు సన్నిహితుడికి చుక్కలు చూపించిన సోము రానున్న రోజుల్లో ఇంకెంత విజృంభిస్తారో వేచి చూడాలి.