Revanth Reddy : బిగ్ ట్విస్ట్: రేవంత్ రెడ్డికి పదవీ గండమట.!

Revanth Reddy : తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని కొత్తగా ఉద్ధరించిందేమీ లేదు ఇటీవలి కాలంలో. టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చాక రేవంత్ రెడ్డి సొంత పబ్లిసిటీ కోసం పని చేస్తున్నారు తప్ప, పార్టీ కోసం ఏమీ చేయలేదన్న విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ప్రధానంగా సీనియర్లు, రేవంత్ రెడ్డిపై గత కొంతకాలంగా గుస్సా అవుతూనే వున్నారు.
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో ‘సంస్కరణల’ నిమిత్తం, పలు రాష్ట్రాల్లో పీసీసీ అధ్యక్షుల మార్పు దిశగా కసరత్తులు షురూ చేసింది కాంగ్రెస్ అధిష్టానం. అయితే, తెలంగాణకు రేవంత్ రెడ్డి ఈ మధ్యనే పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన విషయం విదితమే. ఆయన పీసీసీ అధ్యక్షుడయ్యాకే హుజూరాబాద్ ఉప ఎన్నిక జరిగింది. ఆ ఉప ఎన్నికలో కాంగ్రెస్ మరీ తీసి కట్టులా మారిపోయింది.
దాంతో, రేవంత్ మీద వ్యతిరేకత నానాటికీ మరింతగా పెరిగిపోతూ వచ్చింది. ఈ పరిస్థితుల్లో రేవంత్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగించడం వల్ల ఉపయోగం లేదన్న భావనలో కాంగ్రెస్ అధిష్టానం వుందట. మరి, రేవంత్ రెడ్డి కాకపోతే, పీసీసీ అధ్యక్షుడిగా ఇంకెవరికి అవకాశం వుంటుంది.? అంటే, రేసులో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
కాంగ్రెస్ కారణంగా రేవంత్ రెడ్డికి లాభం కలిగిందనీ, ఆయన్ను కాంగ్రెస్ పార్టీ గనుక పీసీసీ పదవి నుంచి తప్పిస్తే, పార్టీ మారేందుకు రేవంత్ వెనుకాడబోరనీ రేవంత్ మద్దతుదారులు అంటున్నారట. రేవంత్ వ్యతిరేకులపై రేవంత్ మద్దతుదారులు సోషల్ మీడియా వేదికగా చేస్తున్న దుష్ప్రచారం గురించి కొత్తగా చెప్పేదేముంది.?
ఇదిలా వుంటే, తెలుగుదేశం పార్టీ తిరిగి పుంజుకునే పరిస్థితి వస్తే, మళ్ళీ టీడీపీ వైపు రేవంత్ వెళ్ళిపోవడం ఖాయమే.