టీడీపీ నేతలు అఖిల ప్రియ- ఏ.వి సుబ్బారెడ్డిల వ్యవహారం ఇప్పుడు రాష్ర్ట వ్యాప్తంగా మరోసారి సంచలనమవుతోన్న సంగతి తెలిసిందే. సుబ్బారెడ్డిని చంపడానికి అఖిల ప్రియ కోటి రూపాయాలు సుపారీ ఇచ్చిందని సుబ్బారెడ్డి ఆరోపణతో సీన్ మరింత వేడెక్కింది. సుబ్బారెడ్డి తృటిలో ప్రాణపాయం నుంచి తప్పించుకున్నానని లేదంటే ఈపాటికే తను నమ్మిన అఖిల ప్రియ మట్టుబెట్టేదాని మరోసారి ఆరోపణలు గుప్పించారు. ప్రతిగా ఆ ఆరోపణల్ని అఖిల ప్రియ ఖండించారు. గత రెండు రోజులుగా వీరిద్దరి మధ్య చోటు చేసుకున్న మాటలను తీరును పరిశీలిస్తే అఖిల ప్రియ దూకుడు తగ్గించినట్లే కనిపిస్తోంది.
సుబ్బారెడ్డి ఆళ్లగడ్డలో రాజకీయాలు చేస్తే నేనుందుకు అడ్డుపడతానంటూ సాప్ట్ కార్న్ చూపించే ప్రయత్నం చేసారు. కలిసే పనిచేద్దాం అన్న ఒరవడిని చూపిస్తున్నట్లు అనిపించింది. అలాగే వైకాపా ప్రభుత్వాన్ని ఉద్దేశించి కూడా అఖిలప్రియ ఎలాంటి ఆరోపణలు చేయలేదు. స్థానికంగా ఉన్న నాయకుల వల్లే వివాదాలు తలెత్తాయని చెప్పుకొచ్చారు. అయితే ఈ సీన్ లోకి ఇంకా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎంటర్ కాలేదు. గతంలో ఓసారి వివాదాన్ని పరిష్కరించే ప్రయత్నం చేసినా ఈసారి దూరంగా ఉన్నారు. ఎవరి రాజకీయాలు వాళ్లు చేసుకోండి అన్నట్లే వదిలేసినట్లు కనిపిస్తోంది.
ఇక అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్ కు ఈ కేసు విషయంలో కోర్టు ఇప్పటకే విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది. కానీ భార్గవ్ రామ్ తొలి విచారణకు హాజరు కాలేదు. దీంతో శుక్రవారం మరోసారి నోటీసులు ఇచ్చింది. ఈసారి గనుక తప్పించుకుంటే పోలీసులు అరెస్ట్ చేసి బోనులో నుంచో బెట్టాల్సి వస్తుందని హెచ్చరించింది. ఇప్పుడీ అంశాలన్నీ అఖిల ప్రియను మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు సమాచారం. అటు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పట్టించుకోకపోవడం వంటి అంశాలు అఖిల ప్రియకు పూర్తిగా ప్రతికూలంగా మారుతున్నాయి. దీంతో అఖిల్ ప్రియ పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. అలాగని ఆళ్లగడ్డ రాజకీయాలను శాషించిన భూమా వారసురాలి అనే ట్యాగ్ తో వైకాపాలోకి రాలేరు. ప్రస్తుతం ఆమె ఉన్న పరిస్థితుల్లో కూడా వైకాపా శ్రేయస్కరం కాదు. అందుకే ఇప్పుడామె బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.