విజయవాడ దుర్గ గుడి ప్లై ఓవర్ ఇప్పుడు హాట్ టాపిక్. దీంతో టీడీపీ ఎంపీ దుర్గ గుడి క్రెడిట్ ని తమ పార్టీలో వేసుకునే ప్రయత్నాలు మొదలయ్యాయి. దీనిలో భాగంగా ఆ పార్టీకి చెందిన ఎంపీ కేశినాని ప్లై ఓవర్ నడుం కటింది నేనే అన్నట్లు వ్యాఖ్యానించారు. ఈ నిర్మాణం టీడీపీ ప్రభుత్వ హయాంలోనే పూర్తిచేసామని..ఇప్పుడు వైసీసీ ప్రభుత్వం దాని ప్రారంభోత్సవం చేపడుతుందని అన్నారు. దీంతో వైకాపా నేత దేవినేని అవినాష్ రంగంలోకి దిగి కేశినేని నాని వ్యాఖ్యలకు సరైన కౌంటర్లు వేసారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పూర్తి చేయలేకపోయిన పార్టీ నేతలు ఇప్పుడు ప్రారంభోత్సవం చేపడుతుంటే తగుదునమ్మా అంటూ వచ్చారని మండిపడ్డారు.
అధికారంలో ఉన్నప్పుడు బీజేపీని విమర్శించి..ఇప్పుడు మళ్లీ బీజేపీ అవసరం పడే సరికి కాళ్లు పట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారని అవినాష్ ఎద్దేవా చేసారు. అసలు బీజేపీని ఇప్పుడెందుకు కాకా పడుతున్నారో? చెప్పాలంటూ డిమాండ్ చేసారు. రెండేళ్ల క్రితం బీజేపీని తిట్టిన నేతలు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఆ పార్టీ వెనుక పడుతున్నారని..ఇదే టీడీపీ శవ రాజకీయాలకు మచ్చు తనుకని ఆక్షేపించారు. కృష్ణానదీ పరివాహక ప్రాంతంలో రిటైనింగ్ వాల్ నర్మాణం చేస్తానని నమ్మించి బెజవాడ ప్రజల్ని ఎలా మోసం చేసారో మర్చిపోయారా? అని గుర్తు చేసారు. ఇప్పుడీ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
కేశినేని నాని వ్యాఖ్యలపై కౌంటర్లు అంత ఈజీగా పడవు. కానీ ఈసారి ప్లై ఓవర్ జోలికి వచ్చేసరికి వైసీసీ నాయకుడు దూసుకురావడం ఆసక్తికరం అంటూముచ్చటించుకుంటున్నారు. అయితే దేవినేని అవినాష్ ఇలా సీన్ లోకి రావడానికి కారణం జగన్ మెప్పుకోసమేనని అంటున్నారు. జగన్ వెంట నేను ఉన్నాను అని చాటు కోవడానికి అవినాష్ ఇలా నానికి కౌంటర్ వేసినట్లు మాట్లాడు కుంటు న్నారు. ఇప్పటికే అవినాష్ కి విజయవాడ రాజకీయాల్లో జగన్ పెద్ద పీట వేయబోతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోన్న నేపథ్యంలో తాజా ఘటన అవినాష్ కి కలిసొచ్చేలా కనిపిస్తోంది.