Health Tips : మహిళలు నాలుగు పదుల వయసు దాటారా …ఈ ఆహార పద్ధతులు తప్పక పాటించాల్సిందే..!

Health Tips: సాధారణంగా వయసు పెరిగే కొద్దీ మనుషుల్లో ఆరోగ్య సమస్యలు కూడా పెరుగుతూ ఉంటాయి. పూర్వకాలం మనుషులతో పోల్చితే ప్రస్తుత కాలంలో చిన్న వయసు వారికి అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా వయసు పెరిగే కొద్దీ స్త్రీలలో హార్మోన్ల అసమతుల్యత వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. 40 సంవత్సరాల పైబడిన మహిళలు వారి ఆహార పద్ధతులలో కొన్ని మార్పులు చేసుకోవటం చాలా అవసరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వివాహం జరిగి పిల్లలు పుట్టిన తర్వాత మహిళల శరీరాకృతిలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. పిల్లలు పుట్టిన తర్వాత మహిళలు బరువు పెరగటం వల్ల అనేక రకాల వ్యాధులు మొదలవుతాయి.

ముఖ్యంగా బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి సమస్యలు మహిళల్లో 40 సంవత్సరాల తర్వాత మొదలవుతాయి. 40 సంవత్సరాల పైబడిన మహిళలు మంచి పౌష్టిక ఆహారాన్ని తీసుకుంటూ.. ప్రతిరోజు సరిపడ సమయం నిద్ర పోవాలి. అంతేకాకుండా మహిళలు వయసు పెరిగే కొద్దీ తప్పనిసరిగా వ్యాయామాలు చేయటం అలవాటు చేసుకోవాలి.ముఖ్యంగా 40 సంవత్సరాలు పైబడిన మహిళలు వారి ఆహార పద్ధతుల్లో కొన్ని మార్పులు చేసుకోవాలి.

40 సంవత్సరాలు పైబడిన మహిళలు ప్రతి రోజూ తీసుకొనే ఆహారంలో వెల్లులి, ఉల్లి తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. వీటిలో ఉండే ఎన్నో రకాల ఔషధ గుణాలు అనేక వ్యాధులను అరికడతాయి. ముఖ్యంగా వయసు పెరిగేకొద్దీ మహిళలు పచ్చి వెల్లుల్లి తినటం వల్ల బోలు ఎముకల వ్యాది బారిన పడకుండా కాపాడుతుంది. వెల్లుల్లి లో ఉండే అల్లిసిన్
అనే పదార్థం బ్రెస్ట్ క్యాన్సర్ వ్యాధిని దరిచేరకుండా అరికడుతుంది.

మహిళలు ప్రతిరోజు కూరగాయలను కూడా ఎక్కువగా తీసుకోవాలి. వాటిలో ఉండే ఐరన్, జింక్, విటమిన్ కె, లుటిన్, ఫోలేట్, కాల్షియం, బీటా కెరోటిన్ వంటి పోషకాలు శరీరంలో రక్త శాతాన్ని, జ్ఞాపక శక్తిని పెంచుతాయి. కొన్ని రకాల కూరగాయలు పచ్చిగా తినడం వల్ల కంటి చూపును మెరుగుపరుస్తాయి. ఎముకలను బలోపేతం చేస్తాయి.మహిళలకు అప్పుడప్పుడు డార్క్ చాక్లెట్లు తినడం వల్ల ఇందులోని ఫ్లేవనాయిడ్స్ గుండె జబ్బులు, మధుమేహం, అధిక రక్తపోటు నుంచి రక్షిస్తాయి. 40 సంవత్సరాలు పైబడిన మహిళలు ప్రతిరోజు ఉడికించిన కోడిగుడ్లు తప్పనిసరిగా తినాలి .