ఏపీ లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ప్రారంభమైంది. అయితే, అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వైఎసఆర్ కడప జిల్లాలో పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికై వైఎస్ఆర్సీపీ-టీడీపీ వర్గీయుల మధ్య వాగ్వాగం జరిగింది. ప్రొద్దటూరులో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం వద్ద ఇరు పార్టీల నేతల మధ్య క్యూలెన్లు, ఏజెంట్ల విషయంలో వాగ్వాదం తలెత్తినట్లు తెలుస్తోంది.
దీనితో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దూసుకెళ్లారు. దీంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. పోలింగ్ కేంద్రం వద్ద భారీగా పోలీసులను మోహరించారు. ప్రొద్దటూరులోని పరిస్థితుల దృష్ట్యా 12వ వార్డులో వైసీపీ-టీడీపీ అభ్యర్థులను పోలీసులసు గృహనిర్బంధం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో అదనపు భద్రతాసిబ్బందిని ప్రభుత్వం నియమించింది.
మరోవైపు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఓటర్ల జాబితాలో గందరగోళం నెలకొంది. ఒకే కుటుంబానికి చెందిన ఓఠర్లకు వేర్వేర్లు డివిజన్లలో ఓట్లు ఉండటం చూసి వారు అవాక్కయ్యారు. భార్యకు ఓ చోట.. భర్తకు మరో చోట ఓటు ఉన్నట్లు తేలింది. తమకు తెలియకుండానే ఒక డివిజన్లోని ఓట్లను మరో డివిడన్లోకి ఎందుకు మార్చారంటూ ఓఠర్లు ఆందోళనకు దిగినట్లు తెలుస్తోంది. విజయవాడలో జరుగుతున్న పోలింగ్ ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పర్యటించారు. కృష్ణాజిల్లా కలెక్టర్ ఎండీ ఇంతియాజ్ తో కలిసి సీవీఆర్ స్కూల్ ఆవరణలో ఓటింగ్ సరళిని పరిశీలించారు. అలాగే బిషప్ గ్రేసీ హైస్కూల్లో ఏర్పాట్లను పరిశీలించారు.