ఏపీ రాజకీయాలు మొత్తం రాజధాని చుట్టే తిరుగుటున్నాయి. అభివృద్ధి కోసమే వికేంద్రకరణ అని వైసీపీ నాయకులు చెప్తుంటే, రాజధాని క్రెడిట్ టీడీపీ ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే వైసీపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటుందని టీడీపీ నాయకులు చెప్తున్నారు. పరిపాలన వికేంద్రీకరణ, అలాగే సిఆర్డీఏ రద్దు, ఈ రెండు బిల్లులు గవర్నర్ ఆమోదించటం, అలాగే గజెట్ విడుదల కావటంతో, రాజధాని రైతులు కోర్టు మెట్లు ఎక్కారు. రైతుల వాదన విన్న హై కోర్టు రాజధానిపై స్టేటస్ కో విధించింది. ఈ నిర్ణయంపై సుప్రీం కోర్టుకు వైసీపీ ప్రభుత్వం వెళ్లిన విషయం తెలిసిందే. నిన్న 14 కావడంతో విచారించిన హై కోర్టు స్టేటస్ కో ఈనెల 27 వరకు కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది.
అయితే ఈ నిర్ణయంపై ప్రభుత్వ తరపు న్యాయవాది రాకేష్ త్రివేది తన వాదనను వినిపిస్తూ…కావాలంటే వాయిదా వెయ్యాలని, కానీ స్టేటస్ కో ఇస్తే, ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేయటానికి వీలు లేకుండా పోతుందని, అందుకే స్టేటస్ కో ఎత్తేయాలని, హైకోర్టును విజ్ఞప్తి చేసారు. అయితే ఈ వాదనను పిటిషనర్ తరపు న్యాయవాది వ్యతిరేకిస్తూ…చట్టాన్ని ఉల్లంఘించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టే స్టేటస్ కో ఆడిగామని, హై కోర్టుకు విన్నవించుకున్నారు. అయితే ఈ వాదనలు విన్న హై కోర్టు కరోనా సమయంలో అంత అర్జెంట్ గా చేయాల్సిన పనులు ఏమున్నాయని ప్రభుత్వ తరపు న్యాయవాదిని ప్రశ్నిస్తూ, స్టేటస్ కో ను ఈనెల 27 వరకు పొడగించారు. ఈ నిర్ణయంపై అమరావతి రైతులు హర్షం వ్యక్తం చేశారు. స్టేటస్ కో పై ప్రభుత్వ తరపు న్యాయవాదికి హై కోర్టు వేసిన ప్రశ్నకు బదులు చెప్పలేకపోయారు. ఈ సంచలన నిర్ణయం వైసీపీ నేతల్లో మరింత ఆవేదనను పెంచిందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.