ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కరోజులోనే పదివేల పైనే కరోనా కేసులు నమోదవడంతో, రాష్ట్ర ప్రజలు భయాందోళణకు గురవుతున్నారు. ఏపీలో కోవిడ్ పరీక్షలు పెద్ద ఎత్తున చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే గత 24 గంటల్లో ఆంధ్రలో 70,584 శ్యాంపిళ్ళను పరీక్షించగా, 10,093 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక ఒక్కరోజులోనే కరోనా కారణంగా 65 మంది మృతి చెందగా, 2,784 కోలుకున్నారు. దీంతో ప్రస్తుతం ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,20,390కు చేరుకుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
ఇక కొత్తగా నమోదైన కేసుల్లో మరోసారి అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 1676 కరోనా కేసులే నమోదయ్యాయి. ఆ తర్వాత అనంతపురంలో 1371, గుంటూరు 1124, కర్నూలులో 1091, విశాఖ 841, చిత్తూరు 819, పశ్చిమగోదావరిలో 779, కడప 734, నెల్లూరు 608, శ్రీకాకుళం 496, కృష్ణా 259, ప్రకాశం 242, విజయనగరం 53, కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తంగా చూసుకుంటే.. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా బారిన పడి 1,213 మంది మరణించగా, 55,406 మంది కోలుకుని వివిధ ఆస్పత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ప్రస్తుతం ఏపీలో 63,771 మంది కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు. ఇకపోతే ఏపీలో ఇప్పటి వరకు మొత్తం 18,20,009 కరోనా పరీక్షలు జరిగాయని ఏపీ ఆరోగ్యశాఖ వెళ్ళడించింది.