“పుష్ప” కోసం ఇంత హాట్ బొమ్మని దింపుతున్నారా? భారీ డిమాండ్ అట

Nora fatehi to do an item number in Pushpa

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “పుష్ప” కోసం అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేస్తున్న ఈ సినిమా ఇప్పుడు శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేసుకుంటుంది. అయితే ఈ సినిమాపై ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ బజ్ వైరల్ అవుతుంది. నార్మల్ గానే సుకుమార్ సినిమాలో పైగా బన్నీ తో సినిమాలో ఐటమ్ సాంగ్ అదిరిపోయే లెవెల్లో ఉంటుంది.

ఇప్పుడు అలాంటి ఒక హాట్ ఐటమ్ నెంబర్ కోసమే అంతా పుష్ప నుంచి ఎదురు చూస్తున్నారు. అయితే మరి చాలా మంది పేర్లే ఇందుకు వినిపించినా ఇప్పుడు ఓ వెరీ హాట్ ముద్దుగుమ్మ పేరు వినిపిస్తోంది. బాలీవుడ్ లో అందాల అరబోయడంతో మత్తెక్కించే నోరా ఫతేహి పుష్ప ని మరింత హీట్ ఎక్కించనుందట.. అంతే కాకుండా ఈ ఒక్క సాంగ్ కోసం ఆమె ఏకంగా 2 కోట్లు డిమాండ్ చేస్తుందట. ప్రస్తుతానికి మాత్రం ఈ టాక్ వైరల్ అవుతుంది. ఇందులో ఎంతమేర నిజం ఉందో తెలియాలి అంటే ఇంకొన్నలు వేచి చూడాలి.