మూడు రాజధానులపై వైఎస్ జగన్ ప్లాన్ అదేనా.?

ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికల రాబోతున్నాయా.? వైఎస్ జగన్ సర్కార్ ఆ రిస్క్ చేయబోతోందా.? తెలంగాణలో కేసీయార్ అనుసరించిన ‘ముందస్తు’ వ్యూహాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేయబోతున్నారా.? ఇలా చాలా ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి.. ‘మూడు రాజధానుల’ చుట్టూ కొత్త రచ్చ షురూ అయ్యాక.

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సూచనతోనే వైఎస్ జగన్, అనూహ్యంగా మూడు రాజధానుల చట్టాన్ని వెనక్కి తీసుకున్నారనే ప్రచారం ఓ వైపు జరుగుతోంది. అదంతా ఉత్తదే.. కేంద్ర మంత్రి తలంటు పోయడంతేనే ఈ మార్పులు.. అన్న ప్రచారం ఇంకో వైపు కనిపిస్తోంది. ఏది నిజం.?

నిజానికి, వైఎస్ జగన్ సర్కార్ మూడు రాజధానుల ఆలోచన నుంచి వెనక్కి తగ్గలేదు. న్యాయపరమైన వివాదాల నేపథ్యంలో అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించిందని అనుకోవాలి. సరే, ఆ వ్యూహం పనిచేస్తుందా.? చెయ్యదా.? అన్నది వేరే చర్చ.

అయితే, వైఎస్ జగన్ ప్రభుత్వం మాత్రం ముందస్తు ఆలోచనలు చేయకపోవచ్చు. ఇంకో రెండున్నరేళ్ళ పాలనను ముందు పెట్టుకుని, ముందస్తు రిస్క్ ఎందుకు చేస్తుంది.? ఛాన్సే లేదు. 2022లోనో, 2023లోనో ముందస్తు ఆలోచన చేస్తే, అప్పటికల్లా మూడు రాజధానుల వ్యవహారం ఓ కొలిక్కి వచ్చేయాలి.

అలా కాకుండా, కేవలం మూడు రాజధానుల అంశాన్ని ఎన్నికల స్టంటు కోసం వాడుకోవాలనుకుంటే.. అది వైసీపీ రాజకీయ భవిష్యత్తునే దెబ్బతీస్తుంది. అసలు ఇలాంటి గాసిప్స్ ఎలా పుడుతున్నాయోగానీ.. వైసీపీలోనే ఈ వ్యవహారాలపై అంతర్మధనం