ప్రభాస్ సినిమా అంటే మినిమమ్ 200 నుండి 300 కోట్ల బడ్జెట్ పెట్టాలి. అందుకే బడా నిర్మాతలు సర్వం రిస్క్ చేసి ఆయనతో సినిమాలు చేస్తున్నారు. ప్రజెంట్ ప్రభాస్ ‘రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్’ సినిమాలు చేస్తున్నారు. వీటిలో బాలీవుడ్ మేకర్స్ నిర్మిస్తున్న ‘ఆదిపురుష్’ అత్యంత భారీ వ్యయంతో నిర్మితమవుతోంది. ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి 400 కోట్లు పెడుతున్నారు టీ-సిరీస్ నిర్మాతలు. ఇప్పటికే షూటింగ్ మొదలైంది. రోజుకు 3 నుండి 4 కోట్లు ఖర్చవుతోందట.
ప్రభాస్, సైఫ్ అలీ ఖాన్, కృతి సనన్ ఇలా స్టార్ కాస్టింగ్ ఉండటంతో పారితోషకాలు భారీగా చెల్లిస్తున్నారట. ఇవన్నీ ఒక ఎత్తైతే విఎఫ్ఎక్స్ వర్క్ మరొక ఎత్తు. హిస్టారికల్ బ్యాక్ డ్రాప్లో చేస్తున్న సినిమా కావడంతో ప్రతి లొకేషన్, సెట్టింగ్ రీక్రియెట్ చేయాల్సిందే. ఇండోర్ వరకు సెట్టింగ్స్ వేసి మేనేజ్ చేసినా ఎక్కువ భాగం ఔట్ డోర్ కాబట్టి గ్రీన్ మ్యాట్ వేసి లాగించేస్తున్నారు. ఈ గ్రీన్ మ్యాట్ వ్యవహారమంతా షూటింగ్ అయ్యాకే ఎక్కువ ఉంటుంది. పని మొత్తం విఎఫ్ఎక్స్ స్టూడియోలోనే జరగాల్సి ఉంటుంది. విదేశాల్లోనే ఎక్కువ భాగం వర్క్ జరుగుతుంది. దీనికే సుమారు 200 నుండి 250 కోట్ల వరకు ఖర్చవుతుందని అంటున్నారు. అంటే టోటల్ బడ్జెట్ 400 కోట్ల నుండి 250 కోట్ల వరకు అక్కడే పోతుందన్నమాట.