ఎంపీ ధర్మపురి అరవింద్‌పై దాడి.! ఇదో టైపు రాజకీయం.!

బీజేపీ నేతలపై వరుసగా దాడులు జరుగుతున్నాయి. జనంలోకి వెళ్ళేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తోంటే, ప్రజల ముసుగులో గులాబీ పార్టీ కార్యకర్తలు దాడులక దిగుతున్నారంటూ కమలం పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తోన్న సంగతి తెలిసిందే.

ప్రధానంగా బీజేపీ నేత, ఎంపీ ధర్మపురి అరవింద్ ఈ తరహా దాడుల్ని ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. తాజాగా అరవింద్‌పై దాడి జరిగింది. ముంపు ప్రాంతాల్ని సందర్శించేందుకు ఎంపీ వెళితే, భూ సమస్యలపై ఎంపీ స్పందించలేదంటూ ఆయన మీద దాడికి యత్నించారు గ్రామస్తులు.

అయితే, తన మీద దాడి చేసింది తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలేననీ, గులాబీ గూండాలే ఇలాంటి దాడులు చేస్తుంటారనీ ధర్మపురి అరవింద్ ఆరోపిస్తున్నారు. నిజానికి, ఇలాంటి ఘటనలు ఇటీవలి కాలంలో తెలంగాణలో తరచూ జరుగుతున్నాయి. దాడుల ఘటనలు జరిగిన ప్రతిసారీ సింపతీ కార్డు తెరపైకొస్తుంటుంది. అరవింద్ విషయంలో కూడా అదే జరుగుతోందని అనుకోవాలేమో.!

కాగా, ధర్మపురి అరవింద్‌పై దాడి ఘటనకు సంబంధించి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. అధికార తెలంగాణ రాష్ట్ర సమితిపై ఆయన తీవ్రస్థాయి విమర్శలు చేశారు. మరోపక్క, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ఈ వ్యవహారంపై స్పందించారట.
ధర్మపురి అరవింద్‌తో అమిత్ షా మాట్లాడారంటూ బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.