Senior Actress Vasuki: సినీ నటి శ్రీమతి వాసుకి (పాకీజా)కి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆర్థిక సాయం

నటి దీనస్థితికి చలించిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు, శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరఫున రూ.2 లక్షలు సాయం అందించిన శాసన మండలిలో ప్రభుత్వ విప్ శ్రీ పిడుగు హరిప్రసాద్ గారు, శాసన సభ్యులు శ్రీ గిడ్డి సత్యనారాయణ గారు.

తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సినీ నటి శ్రీమతి వాసుకి (పాకీజా)కి ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆప్త హస్తం అందించారు. ఆమె దీన స్థితి తెలిసి చలించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు రూ. 2 లక్షల రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించారు. మంగళగిరి మధ్యాహ్నం మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ఈ మొత్తాన్ని శాసన మండలిలో ప్రభుత్వ విప్ శ్రీ పి. హరిప్రసాద్ గారు, పి.గన్నవరం శాసనసభ్యులు శ్రీ గిడ్డి సత్యనారాయణ గారు పాకీజాకు అందజేశారు.

శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేసిన సాయానికి పాకీజా గారు కృతజ్ఞతలు తెలిపారు. చిన్నవాడైనా ఎదురుగా ఉంటే కాళ్లు మొక్కుతానంటూ భావోద్వేగానికి లోనయ్యారు. తన ఆర్థిక పరిస్థితి గురించి నిన్ననే శ్రీ పవన్ కళ్యాణ్ గారి కార్యాలయానికి తెలియజేశాననీ, తక్షణం స్పందించి తగిన విధంగా ఆర్థిక సాయం అందించారని తెలిపారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి కుటుంబానికి జీవితాంతం రుణపడి ఉంటానన్నారు.

Public Reaction On Ys Jagan Padayatra || Ap Public Talk || Chandrababu || Pawan kalyan || TR