భారీ నష్టాల్లో SBI , మొండి బాకీలూ పెరిగాయి

పబ్లిక్ సెక్టర్ బ్యాంకుల్లో బాహుబలి లా కనిపించే స్టేట్ బ్యాంక్ (ఎస్ బిఐ) నష్టాల వూబిలో పడిపోయింది. దానికి తోడు బ్యాంకు మొండిబాకీలు భారీగా పెరిగాయి. 

ఈ క్వార్టర్ (ఏప్రిల్ -జూన్ కాలం) లో  ఎస్ బిఐకి వూహించిన దానికంటే చాలా ఎక్కువ నష్టాలొచ్చాయి. ఈవివరాలు శుక్రవారం వెల్లడయ్యాయి.

ఇలా నష్టాలు రావడం ఎస్ బిఐ కి ఇది మూడో క్వార్టర్. జూన్ 30 నాటికి ముగిసిన మూన్నెళ్ల కాలానికి (క్వార్టర్ 1) ఎస్ బిఐ నష్టాలెంతో తెలిస్తే గుండెలు గుభేలుమంటాయి.

అక్షరాలా రు. 48.76 బిలియన్లు. అంటే 707.28 మిలియన్ అమెరికన్ డాలర్లు.  ఇది రు. 4876 కోట్ల రుపాయలతో సమానం. ఒక ఏడాది (ఏప్రిల్ -జూన్ కాలం) కిందట బ్యాంకుకు వచ్చి రు. 20.06 బిలియన్ (రు 2006 వేల కోట్లు) లాభాలతో చూస్తే నష్టాలు చాలా చాలాచాలా ఎక్కువ. మార్చి క్వార్టర్ లో రికార్డు స్థాయిలో 77.18బిలియన్ రుపాయల నష్టం వచ్చింది. 

బ్యాంకు వ్యవహారం తలపండిన లెక్కల పండితుల అంచనాలను తారు మారు చేసింది.  వాళ్లే    ఈ మొదటి  క్వార్టర్ లో స్టేట్ బ్యాంక్  నష్టాలు రు. 1.71 బిలియన్ లు మించవని అంచనా వేశారు.  ఇది తలకిందులయింది.  ఎస్ బిఐ బ్యాడ్ లోన్స్ 10.69 శాతం  నుంచి 10.91 శాతానికి పెరిగాయి. గత ఏడాది ఇది కేవలం 9.97 శాతమే.  

ఇది ఎటు దారి తీస్తుందో …