ఆయుష్షు గట్టిదైతే ఎంత పెద్ద ప్రమాదం నుండి అయినా తప్పించుకోవచ్చు. తల్లి దండ్రులతో కలిసి బైక్ పైన వెళుతున్న చిన్నారి యాక్సిడెంట్ అయినా ప్రాణాలతో బయట పడింది. బెంగుళూరు-తుముకూరు నేషనల్ హైవే పైన జరిగిన ఈ యాక్సిడెంట్ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
బైక్ పైన వెళుతున్న ఒక జంట తమ బిడ్డను ముందు కూర్చోబెట్టుకున్నారు. ఆ చిన్నారి తండ్రి హైవేపై వేగంగా వెళుతూ ముందున్న మరో బండిని ఢీ కొట్టడంతో భార్య, భర్తలు ఇద్దరూ కింద పడిపోయారు. కానీ ఆ బైక్ అలానే 300 మీ ప్రయాణించి కింద పడిపోయింది. ఆ చిన్నారి కూడా బండిపైనే ఉంది. బైక్ అలా దూసుకుపోతునప్పుడు లారీలు, కార్లు వెళుతున్నా వాటికి ఢీ కొట్టకుండా కొంతదూరం వెళ్లి డివైడర్ ను ఢీ కొట్టి కింద పడిపోయింది.
ఆ చిన్నారి గడ్డిపైన పడి చిన్నగాయలతో ప్రాణాపాయ ప్రమాదం నుండి తప్పించుకుని మృత్యుంజయురాలయ్యింది. వెంటనే అక్కడ ఉన్నవారు పాప దగ్గరకు వెళ్లి ఎత్తుకున్నారు. పాప క్షేమంగా ఉందని తెలిసి సంతోషించారు. పాప తల్లిదండ్రులకు మాత్రం గాయాలైనట్టు తెలుస్తోంది. ఆ యాక్సిడెంట్ వీడియో కింద ఉంది చూడవచ్చు.