ఇండియన్ సినిమా దగ్గర బిగ్గెస్ట్ బాక్సాఫీస్ హిట్ చిత్రాలు లిస్ట్ తీస్తే వాటిలో మన తెలుగు చిత్రాలు మాత్రమే కాకుండా కన్నడ నుంచి సెన్సేషనల్ హిట్స్ అయినటువంటి చిత్రాలు కేజీఎఫ్ లు కూడా ఉంటాయి. కాగా ఈ చిత్రంలో కన్నడ స్టార్ హీరో రాకింగ్ స్టార్ యష్ నటించగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు.
అయితే ఇండియన్ సినిమా నుంచి బాలు బాహుబలి 2 తర్వాత ఓ సీక్వెల్ కోసం అంతా ఎదురు చూసింది అయితే ఇదే అని చెప్పాలి. కాగా ఈ చిత్రం రిలీజ్ అయ్యి భారీ హిట్ అవ్వడం ఒకెత్తు అయితే మళ్ళీ మరో చిత్రం కూడా కొనసాగింపుగా ఉంది అని అనౌన్స్ చేయడం ఇంకో ఎత్తు అని చెప్పాలి.
అయితే కేజీఎఫ్ చాప్టర్ 3 ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు అలాగే మరో పక్క యష్ 19వ సినిమా ఏంటి అనేది కూడా క్లారిటీ లేదు. ఇక ఈ గ్యాప్ లో దర్శకుడు ప్రశాంత్ నీల్ “సలార్” చిత్రం ప్రభాస్ తో చేస్తుండగా వీటికి కేజీఎఫ్ కి కూడా లింక్ ఉంటుంది అని టాక్ ఉంది.
అయితే ఇప్పుడు మళ్ళీ కేజీఎఫ్ 3 చిత్రమే యష్ చేసే 19వ చిత్రం అంటూ కొన్ని రూమర్స్ ఇప్పుడు మొదలయ్యాయి. అందుకే యష్ కూడా తన నెక్స్ట్ సినిమా ఏంటి ఎవరు డైరెక్ట్ చేస్తారు అనే అంశాలు ఇంకా హోల్డ్ లో ఉంచాడని నెక్స్ట్ సినిమా కేజీఎఫ్ 3 నే స్టార్ట్ చేస్తారు అని ఇప్పుడు గాసిప్స్ గుప్పుమంటున్నాయి.
అయితే ఇది లాజికల్ గా బాగానే ఉంది కానీ ఒకవేళ నిజం అయితే మాత్రం వచ్చే ఏడాది ఎన్టీఆర్ తో తారక్ అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్ అయితే పక్కకి వెళ్ళినట్టే అని చెప్పాలి. ఇప్పుడు ఎన్టీఆర్ దేవర చేస్తుండగా ఈ చిత్రం అనంతరం అయితే తారక్ బాలీవుడ్ చిత్రం “వార్ 2” స్టార్ట్ చేయాల్సి ఉంది. మరి ఇదేమన్నా లేట్ అయితే కేజీఎఫ్ 3 మీదకి ప్రశాంత్ నీల్ రావచ్చు. మరి అసలు యష్ నెక్స్ట్ సినిమా విషయంలో ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో సడెన్ గా రచ్చ స్టార్ట్ అయ్యింది.