Bheemla Naik: భీమ్లా నాయక్ హిందీ వర్షన్ లో పవన్ కళ్యాణ్ కు డబ్బింగ్ చెప్పింది ఇతనే?

Bheemla Naik: బీమ్లా నాయక్ సినిమా రిలీజ్ అయిన రోజు నుండి అటు అభిమానుల సందడి ఇటు సినీ తారల స్పందనలతో రోజు వార్తల్లో నిలుస్తోంది. మహేష్ బాబు తో మొదలు చాలా మంది సెలబ్రిటీస్ భీమ్లా నాయక్ కు ఆల్ ది బెస్ట్ చెప్పడం, సినిమా లో పవన్ కళ్యాణ్, రానా ల నటన ను ప్రశంసించడం కామన్ అయిపోయింది. ఇక భీమ్లా నాయక్ థియేటర్స్ దగ్గర సందడి నెలకొంది.ఓవర్సీస్ లోను అదరగొడుతోంది. ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ పాయింట్ కి చేరుకుంది.తమిళ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమాకు తెలుగు రీమేక్ గా వచ్చిన ఈ సినిమా పవన్ కళ్యాణ్ అభిమానులందరికీ  పండగే అని చెప్పొచ్చు.

ఈ సినిమాని తెలుగు, తమిళ,కన్నడ భాషల్లో మాత్రమే విడుదల చేశారు. హిందీలో విడుదల చేయలేదు. ఇటీవల భీమ్లా నాయక్ సినిమాని హిందీలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే భీమ్లా నాయక్ హిందీ ట్రైలర్ ను విడుదల చేశారు. ప్రస్తుత హీరోలు తమ సినిమాలని హిందీలో విడుదల చేయటానికి తామే డబ్బింగ్ చెప్పుకుంటూ ప్రేక్షకులకు దగ్గరవ్వాలని చూస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఇందుకు భిన్నంగా డబ్బింగ్ చెప్పుకోలేదు. హిందీ వర్షన్ భీమ్లా నాయక్ లో పవన్ కళ్యాణ్ కు గౌరవ్చోప్రా డబ్బింగ్ చెప్పడం జరిగింది.

ఇటీవలే భీమ్లా నాయక్ సినిమాకి డబ్బింగ్ చెప్పడం పై స్పందిస్తూ లెజెండ్ పవన్ కళ్యాణ్ కి డబ్బింగ్ చెప్పడం సంతోషంగా ఉంది గర్వంగా భావిస్తున్నాను అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు గౌరవ్ చోప్రా.గౌరవ్ చోప్రా బాలీవుడ్ బుల్లితెర నటుడు. ఇది తెలిసిన పవన్ కళ్యాణ్ అభిమానులకు గౌరవ్ చోప్రా మీద ఆసక్తి పెరిగింది, ఆయన గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. 1979 ఏప్రిల్ 4 న్యూఢిల్లీ లో పుట్టిన గౌరవ చోప్రా 2004 లో సారా ఆకాశ్ కర్మ లాంటి టీవీ సీరియల్స్ చేశాడు. 2006లో ఒక డాన్స్ రియాల్టీ షో లో కూడా పాల్గొన్నాడు.2013లో తొలిసారి ఒక ఒక తమిళ సినిమా లో కనిపించాడు. అంతేకాకుండా బ్లడ్ డైమండ్ అనే సినిమాతో హాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చాడు. ఇవే కాకుండా తెలుగులోకి అనువాదం అయ్యే హాలీవుడ్ చిత్రాలకు డబ్బింగ్ చెప్తాడు.