లైగర్ సినిమా కోసం రెమ్యూనరేషన్ త్యాగం చేసిన విజయ్.. హిట్ అయితే ఓకే లేదంటే భారీ నష్టం?

రౌడీ హీరో విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మొదటిసారిగా లైగర్ అనే సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా ఆగస్టు 25వ తేదీ విడుదల కావడంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ నిర్వహిస్తున్నారు.ఇక ఈ సినిమా ఇటు విజయ్ దేవరకొండకు అటు పూరి జగన్నాథ్ కు ఇద్దరికీ మొట్టమొదటి భారీ బడ్జెట్ సినిమా కావడం విశేషం.ఇకపోతే ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ సుమారుగా 35 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నారని వార్తలు వినపడుతున్నాయి.

ఇలా విజయ్ కెరియర్ లోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్నప్పటికీ ఈ సినిమా షూటింగ్ సమయంలో బడ్జెట్ సమస్యలు తలెత్తడంతో విజయ్ దేవరకొండ కేవలం 7 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ మాత్రమే తీసుకొని మిగిలినది మొత్తం సినిమా కోసం ఖర్చు చేయమని తిరిగి వెనక్కి ఇచ్చారట. ఇలా సినిమా కోసం తన రెమ్యూనరేషన్ ఇవ్వడమే కాకుండా సినిమా హిట్ అయ్యి లాభాలు వచ్చినప్పుడు మిగిలిన రెమ్యూనరేషన్ తీసుకుంటానని చెప్పారట.

ఈ విధంగా సినిమా కోసం విజయ్ దేవరకొండ రెమ్యూనరేషన్ వెనక్కి ఇవ్వడం అందరిని ఎంతో ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అదేవిధంగా ఈయన వ్యవహార శైలిపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా మంచి లాభాలను అందుకుంటేనే విజయ్ దేవరకొండకు మిగిలిన రెమ్యూనరేషన్ వెనక్కి వస్తుంది లేదంటే ఈయన సుమారుగా 20 కోట్లకు పైగా నష్టపోవాల్సి ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడటమే కాకుండా ఈ సినిమా విడుదలకు ముందే భారీగా బిజినెస్ జరుపుకోవడంతో ఈ సినిమా పక్కా హిట్ అవుతుందని భావిస్తున్నారు. మరి ఈ సినిమా ఎలా ప్రేక్షకులను సందడి చేస్తుందో తెలియాల్సి ఉంది.