త్రివిక్రమ్ పైత్యం..దేవుడి సినిమాలో ఐటెం సాంగ్.!

ఇప్పుడు మారుతున్న కాలంతో సినిమాలో కూడా చాలా మార్పులు వచ్చాయి అలాగే సినిమాని చూసే వారిలో కూడా అభిరుచులు మారాయి. అయితే ఈ సినిమాలో ఇప్పుడు రీమేక్స్ విషయంలో మాత్రం అంతగా ఆసక్తి చూపించట్లేదు. సినిమా మొదటి రోజు భారీ మంచి ఓపెనింగ్స్ వస్తున్నాయి అంటే అది స్టార్ హీరో సినిమా అని అర్ధం.

ఒకవేళ మినిమం ఓపెనింగ్స్ కూడా రిజిస్టర్ చేయని సినిమాలు కూడా ఉన్నాయి అంటే అందులో ఎలాంటి స్టార్ లేడని అర్ధం. దీనితో స్టార్ స్టేటస్ తో రీమేక్ వాల్యూ మారిపోతుంది కానీ భారీ లాభాలు ఇచ్చిన సినిమాలు ఈ మధ్య కాలంలో లేవు. మరి ఇలాంటి చిత్రాల్లో రీమేక్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓ సినిమా కూడా ఉంది.

అయితే మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో పవన్ గెస్ట్ రోల్ గా అందులోని దేవుడి పాత్రలో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ కూడా ఈ మధ్యనే స్టార్ట్ కాగా ఈ సినిమాపై క్రేజీ న్యూస్ అయితే బయటకి వచ్చింది. దీనితో ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ మరియు పవన్ తో ఓ ఐటెం గర్ల్ కలసి సాంగ్ ఉంటుంది అని తెలుస్తుంది.

దీనితో ఒరిజినల్ సినిమా కోసం తెలిసిన వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇది దేవుని సినిమా పైగా ఒరిజినల్ లో పాటలే ఉండవు అలాంటిది తెలుగులో మళ్ళీ ఐటెం సాంగ్ ని యాడ్ చెయ్యడం ఏంటా అని విసుక్కుంటున్నారు. దీనితో తెలుగులో మార్పులు చేర్పులు చేసిన త్రివిక్రమ్ అసలు ఏం చేస్తున్నాడో ఏంటో అని తల గోక్కుంటున్నారు పవన్ అభిమానులు. మరి అసలు త్రివిక్రమ్ ఏం మార్చాడో ఏంటో వేచి చూడాలి.