పవన్ తమిళ సినిమాపై మాట్లాడ్డానికి ఇది బలమైన కారణం.?

టాలీవుడ్ గాడ్ ఆఫ్ క్రేజ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇపుడు పలు చిత్రాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రాల్లో ఈ వారంలో భారీ ఎత్తున రిలీజ్ కి రాబోతున్న లేటెస్ట్ చిత్రమే “బ్రో”. మరి సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన ఈ చిత్రంలో పవన్ గెస్ట్ రోల్ గా నటించాడు.

కాగా ఈ చిత్రం తాలూకా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని మేకర్స్ నిన్న జరపగా ఈ ఈవెంట్ లో అయితే తమిళ సినిమా కోసం పవన్ మాట్లాడ్డం ఒక్కసారిగా వైరల్ గా మారింది. మరి పక్కనే ఉన్న దర్శకుడు సముద్రఖని తమిళ దర్శకుడు అయినప్పటికీ తాను పక్కనే ఉండగానే తమిళ సినిమా లొసుగులు విషయంలో ఎలుగెత్తడం వైరల్ గా మారింది.

అయితే ఈ పవన్ మాట్లాడిన దానిలో ఎక్కడ కూడా తప్పు లేదని చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు కానీ కొందరు అపర మేధావులు మాత్రం పవన్ కి ఏం సంబంధం అని అంటున్నారు. అయితే ఎందుకు సంబంధం లేదు అనేది పవన్ మాటల్లో ఆంతర్యం ఏంటి అనేది కూడా తెలిసి ఉండాలి.

ఇప్పుడు ఇండియన్ సినిమా కేవలం ఒక్క ప్రాంతానికి ఏమి అంకితం కాదు. మార్కెట్ పెరిగింది. ఒక సినిమా ఖ్యాతి మరో భాషలో ఇండస్ట్రీలో పెరుగుతూ గౌరవంగా దూసుకెళ్తుంది. దీనితో ఒక ఇండస్ట్రీ నుంచి మరో ఇండస్ట్రీలో నటులు కానీ సహకారం పరస్పరంగా అందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

అయితే అసలు తమిళ్ వాళ్ళు తమిళ్ లోనే సినిమాలు చేసుకోవాలి అక్కడే స్టేట్ లో ఉండి చేయాలి అని చాలా రూల్స్ పెట్టుకున్నారు.. అయితే అసలు తమిళ సినిమాలో దీనిని రేపింది మరెవరో కాదు మన తెలుగు స్టేట్ ఏపీ మంత్రి రోజా భర్త అయినటువంటి ఆర్ కె సెల్వమణి రాజేసింది అన్నట్టు తెలుస్తుంది.

దీనితో ఆమె తెలుగులో సినిమాలు చేసి రాణించవచ్చు ఏపీలో రాజకీయాల్లో ఉండొచ్చు కానీ ఇప్పుడు మాత్రం సినిమా పరంగా మాత్రం కేవలం తమిళ వారికే ఎందుకు ఉండాలి అని మెయిన్ కారణంతో పవన్ మాట్లాడినట్టుగా తెలుస్తుంది. దీనితో ఈ అంశం కూడా ఓ ప్రధాన కారణం అని అంటున్నారు. అయినా అసలు పవన్ మాట్లాడిన దానిలో కూడా తప్పు ఉంది అని వేలెత్తి చూపించేవాళ్ళు ఓసారి ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.