‎OTT Movie: ఇవేం ట్విస్టులు రా బాబు.. దృశ్యంని మించిపోయిందిగా.. సంచలనం సృష్టిస్తోందిగా!

‎OTT Movie: ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలు థియేటర్స్ లో పెద్ద విజయాన్ని అందుకుంటున్న విషయం తెలిసిందే. ఎలాంటి హంగామా లేకుండా విడుదల అయిన చిన్న సినిమాలో బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం సాధిస్తున్నాయి. అలా ఒక సినిమా కూడా ఇప్పుడు ప్రస్తుతం ఓటీటీ లో సంచలనం సృష్టిస్తోంది. అయితే ఈ సినిమా ఈ ఏడాది విడుదల అయిన సినిమా కాదండోయ్. 2024లో విడుదలైన ఓ సినిమా ఇప్పుడు ఓటీటీలో దూసుకుపోతోంది.

‎ సస్పెన్స్, యాక్షన్ సీన్స్ చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఆ సినిమా పేరే మహారాజా. కోలీవుడ్ స్టార్ హీరో అయిన విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా గత ఏడాది థియేటర్లలో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో విడుదల అయ్యి దుమ్ము రేపుతోంది. జూన్ 2024లో నెట్‌ఫ్లిక్స్‌ లో విడుదలైన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ఇప్పటికీ తెగ ట్రెండ్ అవుతోంది. బలమైన స్క్రీన్ ప్లే, కథాంశం, ఊహించని మలుపులు ఈ సినిమాకు బలంగా మారాయి.

‎ భార్య మరణించిన తర్వాత తప్పిపోయిన కూతురి కోసం ఒక తండ్రి చేసే పోరాటమే ఈ సినిమా స్టోరీ. ఆద్యంతం మలుపులు, విజువల్స్, భావోద్వేగ సీన్స్ జనాలను కట్టిపడేస్తాయి. ముఖ్యంగా సినిమా క్లైమాక్స్ జనాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇందులో విజయ్ సేతుపతి హీరోగా నటించగా బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ విలన్ గా నటించారు. సచ్నా నమిదాస్, మమతా మోహన్‌ దాస్, నటరాజన్ సుబ్రమణ్యం, భారతీరాజా, మునిష్కాంత్ కీలకపాత్రలు పోషించారు. కాగా డైరెక్టర్ నితిలన్ సామినాథన్ తెరకెక్కించిన ఈ చిత్రానికి అన్ని వర్గాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో దూసుకుపోతోంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో ఈ సినిమా అందుబాటులో ఉంది. ఇప్పటివరకు ఆకట్టుకున్న దృశ్యం సినిమా కంటే ఎక్కువగా ట్విస్టులతో సాగుతోంది.