Sudheer babu : మరోసారి సమ్మోహనం డైరెక్టర్ తో సుధీర్ బాబు… ఈసారైనా సక్సెస్ కొట్టేనా..!

Sudheer Babu : సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి హీరో గా ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న హీరో సుధీర్ బాబు. మొదటి నుంచి విభిన్న మైన సినిమాలను చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవాలని తీవ్రంగా కృషి చేస్తున్నాడు సుధీర్ బాబు. విభిన్నమైన కథలు విలక్షణమైన పాత్రలు ఎంచుకుంటూ వస్తున్న ఈ హీరో విజయాలను అందుకోవడం అనే విషయంలో కాస్త వెనుకబడ్డాడు కానీ మంచి సినిమాలను ఎంచుకోవడంలో మాత్రం ఏమాత్రం తడబడలేదు. ఆయన సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా కూడా ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఆ విధంగా వరుస సినిమాలను లైన్ లో పెడుతూ ఇప్పుడు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు సుధీర్ బాబు.

తన కామెడీ టైమింగ్, డాన్సు లతో సినిమాల్లో గుర్తింపు తెచ్చుకున్న సుధీర్ కు కాలం కలిసి రాలేదనే చెప్పాలి. ఆశించినంత విజయాలను మాత్రం సొంతం చేసుకోలేక పోయారు. అయితే తన కొత్త సినిమా కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న’ ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ‘ అనే సినిమా ఇప్పుడు ప్రేక్షకులను అలరించడానికి సిద్దం అవుతుంది. ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.

ఇదే సమయంలో ఈ సినిమా కూడా గతంలో ఇంద్రగంటి మోహన కృష్ణ మరియు సుధీర్ బాబు కాంబినేషన్ లో వచ్చిన సమ్మోహనం అనే సినిమా తరహాలోనే ఉండబోతుందా అన్న సందేహాలు అందరికీ కలిగిస్తుంది. ఆ విధంగా సినిమా నేపథ్యంతో మరొకసారి వీరిద్దరూ కలిసి చేసిన ఈ సినిమా ఏ విధంగా ఉండబోతుంది అనేది చూడాలి. సినిమా బ్యాక్ డ్రాప్ లో అందమైన కథను దర్శకుడు ప్రేక్షకులకు చెప్పబోతున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ సహకారంతో బెంచ్ మార్క్ స్టూడియోస్ పతాకంపై నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమా విడుదల తేదీపై చిత్రబృందం త్వరలోనే స్పష్టత ఇవ్వనుంది.