సుధీర్‌ బాబు పరిస్థితి ఇలా మారిపోయిందేమిటి…?

‘సమ్మోహనం’ సినిమాతో మంచి క్రేజ్‌ తెచ్చుకున్న సుధీర్‌ బాబు.. ఈ క్రేజ్‌ను కాపాడుకోవడానికి ప్రతీ సినిమాకు తన బెస్ట్‌ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. కెరీర్‌ బిగెనింగ్‌ నుంచి కథా బలమున్న సినిమాలు చేస్తున్న కమర్షియల్‌ హీరో స్టేటస్‌ మాత్రం దక్కించుకోలేకపోతున్నాడు . కెరీర్‌ బిగెనింగ్‌ నుండి వినూత్న సినిమాలు చేస్తున్నా ఎందుకో సుధీర్‌కు రావాల్సిన గుర్తింపు రావడం లేదు. ‘సమ్మోహనం’ సినిమాతో మంచి క్రేజ్‌ తెచ్చుకున్న సుధీర్‌.. ఈ క్రేజ్‌ను కాపాడుకోవడానికి ప్రతీ సినిమాకు తన బెస్ట్‌ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు.

కానీ టైమ్‌ బాలేకో, అదృష్టం లేకో సుధీర్‌ సినిమాలు వరుసగా ఫ్లాపుల బాట పడుతున్నాయి. ఈ ఏడాది రిలీజైన ‘హంట్‌’ సుధీర్‌ కెరీర్‌లో అతిపెద్ద డిజాస్టర్‌గా మిగిలింది. ప్రస్తుతం ఆయన ఆశలన్నీ ‘మామా మశ్చీంద్రా’ సినిమాపైనే ఉన్నాయి. అక్టోబర్‌ 6న రిలీజ్‌ కాబోతున్న ఈ సినిమా నుంచి మేకర్స్‌ బ్యాక్‌ టు బ్యాక్‌ అప్‌డేట్‌లు ప్రకటిస్తూ జనాల్లో మంచి క్యూరియాసిటీ క్రియేట్‌ చేస్తున్నారు.

ఆ మధ్య రిలీజైన టీజర్‌కు మంచి రెస్పాన్స్‌ తాజాగా మేకర్స్‌ ఈ సినిమా నుంచి అడిగా అడిగా అంటూ సాగే అమ్మ పాటను రిలీజ్‌ చేశారు. చైతన్య భరద్వాజ్‌ స్వర పరిచిన ఈ పాటను శ్రీనివాసన్‌ ఆలపించాడు.

కామెడీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సుధీర్‌ బాబుకు జోడీగా ఈషా రెబ్బా, మృణాళిని రవి నటిస్తున్నారు. శ్రీవెంకటేశ్వరా సినిమాస్‌ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై సునీల్‌ నారంగ్‌, పుస్కుర్‌ రామ్‌ మోహన్‌ రావు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చైతన్య భరద్వాజ్‌ సంగీతం అందిస్తున్నాడు.