సినీ నటుడు మోహన్ బాబు తన ఇంట్లో జరిగిన గొడవల మూలంగా అతడి లైసెన్స్డ్ గన్ డిపాజిట్ చేయాలని పోలీసులు కోరిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా హైదరాబాద్ నుంచి తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం రంగంపేటలోని తన యూనివర్సిటీకి వెళ్ళిన మోహన్ బాబు అక్కడ చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో తన డబుల్ బ్యారెల్ లైసెన్స్డ్ గన్ ని పిఆర్ఓ ద్వారా పోలీస్ స్టేషన్లో డిపాజిట్ చేయించారు.
అలాగే టీవీ9 రిపోర్టర్ దాడి విషయంలో మోహన్ బాబు పై హత్య కేసు నమోదయింది. తాజాగా ఈ విషయంపై రాచకొండ సీపీ సుధీర్ బాబు మరొకసారి కీలక ప్రకటన చేశారు. మోహన్ బాబు మంచు మనోజ్ వివాదంలో ఇప్పటికి మూడు ఎఫ్ ఐ ఆర్ ను నమోదు చేసాం. వీటిపై దర్యాప్తు చేస్తున్నాం. మోహన్ బాబు అరెస్టు విషయంలో ఆలస్యం జరగడం లేదు ఆయన వద్ద మెడికల్ రిపోర్ట్ తీసుకోవాలి, ఈ విషయంగా ఆయనకి నోటీసులు ఇచ్చాము.
అయితే ఆయన డిసెంబర్ 24వ తేదీ వరకు సమయం అడిగారు, కోర్టు కూడా ఆయనకి పర్మిషన్ ఇచ్చింది. 24వ తేదీ లోపు ఆయనని ఎగ్జామ్ చేయవచ్చా అనే విషయం కోర్టు ద్వారా తెలుసుకుంటాం. తర్వాత మోహన్ బాబు కి మరొకసారి నోటీసులు జారీ చేస్తాం. 126 బి ఎన్ ఎస్ ఎస్ ద్వారా ఆయన సమయం అడగవచ్చు. మరోవైపు నోటీసులకి ఆయన స్పందించకపోతే అరెస్టు చేస్తాం అని చెప్పుకొచ్చారు సుధీర్ బాబు.
అలాగే మోహన్ బాబుకు రాచకొండ పరిధిలో ఎలాంటి లైసెన్స్డ్ గన్స్ లేవు. మోహన్ బాబు వద్ద ఉన్న గన్స్ రెండు ఒకటే డబుల్ బ్యారెల్ రెండు స్పానిష్ మేడ్ రివాల్వర్. అందులో డబుల్ బ్యారెల్ గన్ ని మోహన్ బాబు పోలీసులకు డిపాజిట్ చేశారు. అంతేకాకుండా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న టీవీ9 రిపోర్టర్ రంజిత్ దగ్గరికి వెళ్లి ఆయనకి క్షమాపణ చెప్పారు. ఉద్దేశపూర్వకంగా చేసినది కాదని పొరపాటున జరిగిందని తప్పు తనదే అని చెప్పుకొచ్చారు.