నాగచైతన్య సినిమాకి షాక్ ఇచ్చిన కర్ణాటక ప్రభుత్వం.. షూటింగ్ నిలిపివేయాలంటూ షాక్?

నాగచైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.సమంతకు విడాకులు ఇచ్చిన తర్వాత నాగచైతన్య వరుస సినిమాలలో నటిస్తూ తన పూర్తి దృష్టిని సినిమాలపై పెట్టారు.ఈ క్రమంలోనే థాంక్యూ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగచైతన్యకు నిరాశ ఎదురైనప్పటికీ ఈయన ఏమాత్రం నిరుత్సాహపడకుండా తన తదుపరి సినిమా విషయంలో ఎంతో బిజీగా మారిపోయారు. ప్రస్తుతం నాగచైతన్య వెంకట్ ప్రభు దర్శకత్వంలో ద్విభాషా చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. తాజా షెడ్యూల్ చిత్రీకరణలో భాగంగా చిత్ర బృందం కర్ణాటకలో షూటింగ్ పనులను ప్రారంభించారు. ఈ క్రమంలోనే కర్ణాటకలోని మేలుకోట సమీపంలో ఆ జిల్లా అధికారుల నుంచి షూటింగ్‌కి అనుమతులు తీసుకొని చిత్రీకరణ జరపుతున్నారు. ఈ చిత్రీకరణలో భాగంగా వైన్ షాపు సెట్ వేసి చిత్రీకరణ ప్రారంభించారు. అయితే ఉన్నఫలంగా ఈ సినిమా షూటింగుకు అంతరాయం ఏర్పడింది.

వైన్ షాపు సెట్ వేసిన ప్రాంతంలోనే ఓ దేవాలయం ఉందని అయితే ఈ వైన్ షాప్ సెట్ కూడా ఆలయ గోపురం తరహాను పోలి ఉండడంతో స్థానిక ప్రజలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒక్కసారిగా సినిమా షూటింగ్ జరపకూడదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. పవిత్రమైన దేవాలయ ప్రాంతంలో ఇలా వైన్ షాప్ సెట్ వేస్తూ డాన్సులు వేయడం ఏంటి అంటూ మండిపడ్డారు.ఈ క్రమంలోనే స్థానికులు ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో పోలీసులు రంగంలోకి దిగి సినిమా షూటింగ్ నిలిపివేయాలంటూ షాక్ ఇచ్చారు. చేసేదేమీ లేక చిత్ర బృందం సినిమా షూటింగ్ నిలిపివేసినట్లు తెలుస్తోంది.