Samantha To Pair : నాగచైతన్య సరసన సమంత.! ఖాయమైందట కదా.?

Samantha To Pair : అక్కినేని నాగచైతన్యతో కలిసి సమంత ఓ సినిమాలో నటించబోతోందట. తెలుగు సినీ పరిశ్రమలో వినిపిస్తోన్న లేటెస్ట్ అండ్ హాటెస్ట్ గాసిప్ ఇది. ఈ గాసిప్ గనుక నిజమైతే, ఇదో సంచలనం కాబోతోందన్నది నిర్వివాదాంశం. ఇటీవల నాగచైతన్య, సమంత తమ వైవాహిక బంధాన్ని తెగతెంపులు చేసుకున్న విషయం విదితమే.

ఆ తర్వాత సోషల్ మీడియాలో అటు నాగచైతన్య, ఇటు సమంతతోపాటు పనిలో పనిగా అక్కినేని నాగార్జునని కూడా ట్రోల్ చేసి పారేశాడు నెటిజన్లు. ఆ ట్రోలింగ్ ఇంకా ఇంకా కొనసాగుతూనే వుంది. ఇంకోపక్క నాగచైతన్యతో సమంత విడిపోవడానికి కారణాలు ఇవట కదా.. అంటూ వినిపిస్తున్న ఊహాగానాలకు కొదవే లేదు.

‘సమంత వల్లనే విడాకులు..’ అంటూ నాగ్ అన్నాడంటూ ఓ ప్రచారం బయటకు రావడంతో, దాన్ని నాగ్ తాజాగా ఖండించాడు. ఇంత గందరగోళం నడుమ అసలు నాగచైతన్య – సమంత కాంబినేషన్ వర్కవుట్ అవడమా.? ఇదంతా ట్రాష్.. అనేవారూ లేకపోలేదు.

అయితే, అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం నాగచైతన్య – సమంత కాంబినేషన్‌లో సినిమా దాదాపు ఖాయమయ్యిందంటున్నారు. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మంచబోతోందట. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ఒకరు ఈ సినిమాకి దర్శకత్వం వహించే అవకాశాలున్నాయని సమాచారం.

ఒకవేళ ఈ కాంబినేషన్ గనుక వర్కవుట్ అయితే, చైతూ – సమంత చుట్టూ జరుగుతున్న ట్రోలింగ్ కొంతవరకు ఆగవచ్చేమో. విడాకుల తర్వాత సమంత, ‘పుష్ప’ సినిమా కోసం స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే.