మనసు పారేసుకుంది.. ఆ ప్రేమకు సమంత ఫిదా!!

సమంత సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. నెటిజన్లతో ముచ్చటిస్తూ, ఫ్యాన్స్‌కు నిత్యం అందుబాటులో ఉంటుంది. ఫ్యాన్స్ క్రియేట్ చేసే మీమ్స్, ఫన్నీ ట్రోల్స్‌ను ఫుల్లుగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అలాంటి సామ్ తాజాగా ఓ వీడియోను చూసి తెగ మురిసిపోయింది. ప్రేమకు చిహ్నంగా నిలిచిన ఆ వీడియోపై మనసు పారేసుకున్నట్టు కనిపిస్తోంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే..

Samantha Reaction On Cow Bull Love Videos
Samantha Reaction On Cow Bull Love Videos

అప్పట్లో ఆవు, ఎద్దు ప్రేమకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. అందులో ఆవును అమ్మేయగా.. దాన్ని ట్రాలీలో వేసుకుని వెళ్తుండగా.. దాని వెంటే ఎద్దు కూడా పరిగెత్తడం, ఆ ట్రాలీని అడ్డగించి, అక్కడే ఉండటం, దాని చుట్టే తిరగడం చేసింది. ఈ వీడియో అప్పట్లో అందర్నీ కదిలిచింది. ఇక ఎంతకీ ఆ ఎద్దు వినకపోవడంతో దాని ప్రేమను అర్థం చేసుకున్న యజమాని ఆ ఇద్దరికి కలిపి ఉంచేశాడు.

పవిత్ర ప్రేమ, నిజమైన ప్రేమ ఎప్పటికీ నిలిచి ఉంటుంది… ఇండియాలో ఈ అద్భుత దృశ్యం చోటు చేసుకుంది ఓ విదేశీయుడు ఈ వీడియోను పోస్ట్ చేశాడు. ఇక వాటి ప్రేమను చూసి ముగ్దురాలైన సమంత ఓ హార్ట్ సింబల్‌ను షేర్ చేసింది. ఎంతైనా ఓ ప్రేమికురాలు.. ప్రేమ అంటే తెలిసిన అమ్మాయి.. పైగా జంతు ప్రేమికురాలు, ఆ మూగ జీవుల ప్రేమను చూసి చలించకుండా ఉంటుందా?. సమంత జీవితంలోనూ ప్రేమకు అత్యున్నత స్థానం ఉంది. కోరుకున్న ప్రియుడిని పెళ్లి చేసుకుని ఆనందంగా జీవితాన్ని గడుపుతోంది. సమంత ఈ మధ్య ఫ్యాషన్ రంగంలోకి అడుగుపెట్టింది. సాకీ వరల్డ్ అనే బ్రాండ్‌తో కొత్త రకాల డిజైనర్ దుస్తులను మార్కెట్‌లోకి తీసుకురాబోతోన్నట్టు ప్రకటించింది.