పెళ్లి తర్వాత కూడా సౌత్ ఇండస్ట్రీలో అగ్ర కథానాయిక పొజిషన్ ను ఎంజాయ్ చేస్తోంది సమంత. నిజానికి చాలామంది హీరోయిన్లు పెళ్లయ్యాక సినిమాల మీద అంతగా ఆసక్తి చూపించరు. పెళ్లి తర్వాత తమ ఫ్యామిలీ లైఫ్ కే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తుంటారు. కానీ.. సమంత మాత్రం పెళ్లి తర్వాత తన సినిమాల జోరు పెంచింది. ఇప్పటికీ తన చేతి నిండా సినిమాలు ఉన్నాయి.
కాకపోతే కరోనా వల్ల సినిమా షూటింగ్ లకు బ్రేక్ రావడంతో సమంత ఇంటివద్దనే ఎక్కువగా గడుపుతోంది. గార్డెనింగ్ చేయడం, వంటలు నేర్చుకోవడం లాంటివి చేస్తూ టైమ్ పాస్ చేస్తోంది. తను ఏ పని చేసినా వెంటనే సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం.. వెంటనే తన అభిమానులు సూపర్ అనడం.. తనకు సమయం దొరికినప్పుడల్లా తన అభిమానులతో మాట్లాడుతూ కాలక్షేపం చేస్తోంది సమంత.
అయితే.. ఇటీవల సమంత తన ట్విట్టర్ లో ఆస్క్ సామ్ సెషన్ అని ఓ హ్యాష్ టాగ్ క్రియేట్ చేసి.. తన అభిమానులు తనను ఏదైనా ప్రశ్న అడగాలనుకుంటే అడగొచ్చని చెప్పింది.
వెంటనే సామ్ మీద తన అభిమానులు ప్రశ్నల వర్షం కురిపించారు. మీకు ఇప్పటి వరకు కష్టంగా అనిపించిన పాత్ర ఏది అని ఓ అభిమాని ప్రశ్న వేయగా… రొమాంటిక్ సీన్స్, కామెడీ.. ఈ రెండు నాకు కొంచెం కష్టం అని నేను అనుకునేదాన్ని. కానీ.. ఆ సీన్లలో నటించినప్పుడు మాత్రం నాకు అంతగా కష్టం అనిపించలేదు.. అని చెప్పింది సామ్.
ఇక.. మీరు చివరిసారిగా ఎప్పుడు ఏడ్చారు.. అని ఓ నెటిజన్ ప్రశ్న వేయగా… నన్ను ఈ ప్రశ్న అడిగినందుకు సంతోషంగా ఉంది.. ఇటీవలే ది ఫ్యామిలీ మ్యాన్ రషెస్ చూశాను. అవి చూసి నాకు ఏడుపు ఆగలేదు.. వెక్కి వెక్కి ఏడ్చా.. అంటూ చెప్పుకొచ్చింది సమంత.
అన్నట్టు… సమంత అక్కినేని ప్రస్తుతం ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ది ఫ్యామిలీ మ్యాన్ సెకండ్ సీజన్ లో ఆమె నటించింది. ఆ వెబ్ సిరీస్ లో ఓ టెర్రరిస్టుగా సమంత కనిపించనుంది. ఈ సీజన్ షూటింగ్ పూర్తయి.. డబ్బింగ్ పనులు కూడా పూర్తయ్యాయి. బాలీవుడ్ యాక్టర్ మనోజ్ బాజ్ పాయ్, ప్రియమణి ముఖ్యపాత్రలో నటించారు. రాజ్ డీకే సిరీస్ కు దర్శకత్వం వహించారు. అక్టోబర్ లో ఈ వెబ్ సిరీస్ ఓటీటీలో రిలీజ్ కానుంది.