ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్ లో భారీ క్రేజ్ ఉన్న మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ఫస్ట్ గ్లింప్స్ తో ఒక్కసారిగా సెన్సేషనల్ హైప్ రేపిన చిత్రం “పుష్ప 2” కూడా ఒకటి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ తెరక్కేక్కిస్తున్న చిత్రం అసలు ఎలా సుకుమార్ ఎలాంటి ప్రొసీడింగ్ తో చూపిస్తారు అని చాలా మంది ఆసక్తిగా అనుకున్నారు.
అయితే ఒక్కసారిగా పుష్ప 2 ఏకంగా ఇంటర్నేషనల్ జంప్ తీసుకుంటుంది అని ఐతే ఎవరూ ఊహించి ఉండరు. దీనితో ఇక ఒక్క అల్లు అర్జున్ పాత్రే హైలైట్ అవుతుంది ఇతర రోల్స్ అన్నీ తగ్గిపోవచ్చు అనే టాక్ కూడా మొదలైంది. ఇది ఇదిలా ఉండగా పుష్ప 2 నుంచి లీక్ అంటూ హీరోయిన్ రష్మికా మందన్నా పై ఓ పిక్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కాగా ఇందులో అయితే రష్మికా మందన్నా చనిపోయినట్టుగా చూపిస్తున్నారు. దీనితో పుష్ప 2లో రష్మిక రోల్ అవుట్ అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా స్టార్ట్ అయ్యాయిపోయాయి. అయితే అసలు కథ ఇక్కడే ఉంది. నిజానికి అది రష్మికా మందన్నా కాదట. అచ్చు గుద్దినట్టుగా రష్మికా లా అనిపించే మరాఠి నటి అని కన్ఫర్మ్ అయ్యింది.
కాగా ఆ చిత్రం మరాఠి లో నై వరంబాత్ లోచ్ నా కోయ్ కోచ అనే చిత్రం లోది అట. ఆ సినిమాలో వేరే హీరోయిన్ విజువల్ ని రష్మికా మందన్నా రోల్ పుష్ప 2 లో చనిపోయింది అని స్ప్రెడ్ చేయడం ఇప్పుడు ఓ రేంజ్ లో వైరల్ గా మారింది తప్ప అది పుష్ప 2 నుంచి లీక్ కాదు షాక్ కాదు.
https://twitter.com/helltohaters/status/1659620726264188928?s=20
