రవితేజ సినిమాకి 1000 కోట్ల పొటెన్షియల్.?

టాలీవుడ్ సినిమా దగ్గర తమ స్వయం కృషితో స్టార్ హీరోలుగా ఎదిగిన అతి కొద్ది మందిలో మాస్ మహారాజ రవితేజ కూడా ఒకరు. మరి రవితేజ ఇప్పటివరకు ఎన్నో భారీ లాభాలు ఇచ్చిన సినిమాలూ ఉన్నాయి అలాగే ఘోరమైన నష్టాలు ఇచ్చిన సినిమాలూ ఉన్నాయి.

అయితే రవితేజ ని ఎక్కువ ఎంటర్టైన్మెంట్ బ్యాక్ డ్రాప్ లోనే చూడ్దనైకి ఇష్టపడే జనం ఆ సినిమాలకే వసూళ్లు ఎక్కువ అందిస్తున్నారు. తాను సీరియస్ గా చేసిన డ్రామాలు చాలా తక్కువ ప్రాఫిట్స్ లో ఉన్నాయి. కమర్షియల్ సినిమాలు కూడా మంచి హిట్స్ ఉన్నాయి కానీ రవితేజ ఏదైనా ప్రయోగాత్మక సినిమా చేస్తే మాత్రం ఎందుకో అది ప్లాప్ గానే నిలిచిపోతుంది.

అయితే ఇప్పటివరకు రవితేజ కెరీర్లో హైయెస్ట్ వసూళ్లు అందుకున్న సినిమా బహుశా రీసెంట్ గా వచ్చిన “ధమాకా” కావచ్చు. షేర్ లెక్కలు ఎలా చూసుకున్నా రవితేజ సినిమాల మార్కెట్ అయితే యావరేజ్ గా 50 నుంచి 60 కోట్లు షేర్ 120 కోట్ల మేర గ్రాస్. కానీ ఇప్పుడు మాస్ మహారాజ చేస్తున్న “టైగర్ నాగేశ్వరరావు” తో ఐతే 1000 కోట్ల మార్కెట్ ఓపెన్ అవుతుంది అని ఆ సినిమా దర్శకుడు అంటున్నాడు.

అయితే ఇది సినిమాపై ఉన్న నమ్మకంతో చెప్తున్నాడు అనుకోవచ్చు. కానీ ఈ సినిమాకి ఉన్న స్పాన్ ఆ రేంజ్ లో ఉంటుంది అని తాను ఆ ఉద్దేశంతో చెప్పాడు. అంటే 1000 కోట్ల వరకు ఈ సినిమా వెళ్లకపోయినా అంత పెద్ద హిట్ అవుతుంది అని వారి నమ్మకం.

అంటే ఈ లెక్కన ఈ సినిమాలో కంటెంట్ గాని ఎలిమెంట్స్ గాని ఏ స్థాయిలో ఉంటాయో మనం అర్ధం చేసుకోవచ్చు. మరి పాన్ ఇండియా లెవెల్లో ఈ చిత్రం అంత పెద్ద హిట్ అయితే రవితేజ ఫ్యాన్స్ తో పాటుగా తన మార్కెట్ పెరిగినందుకు ఇతర హీరోల అభిమానులు కూడా ఎంతో ఆనందిస్తారు.